అగ్ర హీరోల పిల్లలు చేసే చిలిపి చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా అగ్రహీరోల పిల్లలు చిన్నతనం నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఈ విషయంలో ముందుంటుంది. సితార వంశీపైడిపల్లి కూతురు ఆద్యాతో కలిసి ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఈ ఛానల్లో ఆమె చేసే చిలిపి పనులు ట్రెండింగ్ అవుతుంటాయి. అదేవిధంగా అల్లు అర్జున్ కూతురు తండ్రి చేసే పనులు వైరల్ అయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ అగ్రహీరో కుమారుడు ఈ కోవాలో చేరాడు.
బాలీవుడ్ అగ్రహీరో షారూఖ్‌ఖాన్ తన కుమారుడు అబ్రామ్ ప్రతిభను చూసి మురిసిపోతున్నాడు. తన స్కెచ్ వేసిన కుమారుడిని మెచ్చుకుంటూ షారూఖ్ ఖాన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. తాను ముగ్గురు పిల్లలకు తండ్రి అయినందుకు గర్వంగా ఉందన్నాడు. ఇది తనకు పెద్ద అఛీవ్‌మెంట్‌లా అనిపిస్తుందని షారుక్ పేర్కొన్నాడు.
తన చిన్న కుమారుడు నా చిత్రాన్ని ఎంతో సుందరంగా గీశాడంటూ మురిసిపోతున్నాడు. ఈ స్కెచ్ చూడగానే చెప్పలేని ఆనందం కలిగిందని చెప్పుకొచ్చాడు. షారూఖ్ ఖాన్ ‘జీరో’ సినిమా తరువాత మరే సినిమా చేయలేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నారు. జీవితంలో బాల్యం అద్భుతమైనది చెప్పాడు. ప్రస్తుతం అబ్రామ్ వేసిన స్కెచ్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ అగ్ర నటులు సినిమాలతో ఫ్యాన్స్ ను అలరిస్తే వాళ్ల పిల్లలు చిలిపి పనులతో ఆకట్టుకుంటున్నారు.