https://oktelugu.com/

Shah Rukh Khan, Atlee film: షారుఖ్ ఖాన్ సినిమాలో సౌత్ డామినేషన్ !

Shah Rukh Khan, Atlee film: తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి ( Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నేషనల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే దర్శకుడు అట్లీ మాత్రం తన తమిళ ప్రేమను మాత్రం వదిలిపెట్టట్లేదు. ఈ సినిమాలో ఎక్కువగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులనే మెయిన్ పాత్రలు కోసం తీసుకుంటున్నాడు. […]

Written By:
  • admin
  • , Updated On : September 4, 2021 / 06:47 PM IST
    Follow us on

    Shah Rukh Khan, Atlee film: తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి ( Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నేషనల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే దర్శకుడు అట్లీ మాత్రం తన తమిళ ప్రేమను మాత్రం వదిలిపెట్టట్లేదు. ఈ సినిమాలో ఎక్కువగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులనే మెయిన్ పాత్రలు కోసం తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా సినిమా అయినప్పటికి, సినిమాలో హీరో బాలీవుడ్ సూపర్ స్టార్ అయినప్పటికీ అట్లీ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.

    ఇప్పటికే హీరోయిన్ విషయంలో కూడా అట్లీదే పై చేయి అయింది. నిర్మాతలు, హీరోయిన్ గా విద్యాబాలన్ అయితే బాగుంటుంది అని మొదట అభిప్రాయపడ్డారు. అయితే అట్లీ మాత్రం షారుఖ్ ను ఒప్పించి మరీ నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేశాడు. ఇప్పుడు మిగిలిన కీలక పాత్రల్లోనూ సౌత్ ఇండియా నటీనటులనే సెలెక్ట్ చేస్తున్నాడు. ఎలాగూ షారుఖ్ ఖాన్ హీరో కాబట్టి.. హిందీ ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.

    ఇక మిగిలిన నటుల్లో సౌత్ నుంచి స్టార్ డమ్ ఉన్న ఒకర్ని ఇద్దరిని పెట్టుకున్నా.. నిజమైన పాన్ ఇండియా సినిమా అవుతుంది. అందుకే షారుఖ్ ఖాన్ సినిమా అయినా సౌత్ డామినేషనే ఈ సినిమాలో ఎక్కువ గా కనిపించనుంది. ఏది ఏమైనా నేషనల్ వైడ్ గా అట్లీకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. తీసిన నాలుగు సినిమాలు ‘రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్’ ఇలా ప్రతి సినిమా సూపర్ హిటే. అందుకే అట్లీతో సినిమా చేయడానికి షారుఖ్ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నాడు.

    కానీ మధ్యలో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. కానీ, వీరి సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిజానికి షారుఖ్ ఖాన్ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. కొన్ని సంవత్సరాలుగా షారుఖ్ కి హిట్ లేదు. వరుస అపజయాలతో డీలా పడిపోయిన షారుక్ ఖాన్ దాదాపు మూడు సంవత్సరాలుగా ఖాళీగానే ఉన్నాడు.

    మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత చేస్తోన్న సినిమా అట్లీదే. అందుకే, ఈ సినిమా పై షారుఖ్ అభిమానులతో పాటు షారుఖ్ ఖాన్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి షారుక్ ఖాన్ కి అట్లీ ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.