Site icon OkTelugu

Chiranjeevi GodFather: మెగాస్టార్ కెరీర్ లోనే ప్రత్యేకమైన గెటప్ !

Chiranjeevi GodfatherChiranjeevi GodFather: మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా కూడా చిరు లుక్స్ ను మార్చబోతున్నారు.

పంచె కట్టుతో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చిరు ఒక లుక్ లో కనిపిస్తే.. రెండో గెటప్ మాత్రం డాన్ లుక్ లో ఫుల్ గడ్డంతో చిరు చాలా కొత్తగా కనిపిస్తారట. ఈ లుక్ చిరు కెరీర్ లోనే ప్రత్యేకమైన గెటప్ గా నిలిచిపోతుందట. మెగాస్టార్ రెండు పాత్రలకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా మోహన్ రాజా ఇప్పటికే సిద్ధం చేశారు. కాకపోతే డాన్ గెటప్ పది నిముషాలు మాత్రమే ఉంటుంది.

ఇక అలాగే ఈ సినిమాలో చాలా పాత్రలను యాడ్ చేశారు. ఆ పాత్రల్లో హీరోయిన్ పాత్ర కూడా ఒకటి. ఈ సినిమాలో చిరుకి హీరోయిన్ గా నయనాతర నటించబోతుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మోషన్‌ టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ తల పై క్యాప్‌ తో స్టైలిష్‌ లుక్ లో చేతిలో గన్‌ పట్టుకుని అలా ఫోజ్ ఇస్తే అభిమానులకు పూనకాలతో ఊగిపోయారు.

ఇక ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ను స్టంట్‌ మాస్టర్‌ సిల్వ నేతృత్వంలో విలన్స్ పై షూట్ చేస్తున్నారు. కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తుండగా.. నిరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version