https://oktelugu.com/

Serial actress :  ఇన్ స్టా లో స్టార్ హీరోలకు మించి ఫాలోవర్స్ ఉన్న సీరియల్ నటి..ఆస్తి కూడా రూ.250 కోట్లు పైనే..ఎవరో తెలుసా.

హీరోయిన్ లకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నారు సీరియల్ హీరోయిన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఒక సీరియల్ హీరోయిన్ కు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉంది. ఆమెకు ఎంతలా క్రేజ్ ఉందంటే స్టార్ హీరోలకు మించిన ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఈ సీరియల్ నటికి ఉన్నారు అంటే నమ్మశక్యం కాదు.

Written By:
  • Mahi
  • , Updated On : January 25, 2025 / 05:33 PM IST
    Bollywood Serial actress

    Bollywood Serial actress

    Follow us on

    Serial actress : నిత్యం సోషల్ మీడియాలో సినిమా నటీనటులతో పాటు సీరియల్ నటీనటుల ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండియాలోనే అత్యధిక ఇమ్యూనరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మ. సోషల్ మీడియా లో కూడా ఈమెకు రికార్డ్ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. చాలామంది హీరోయిన్ల కోసమే సినిమాలకు వెళ్తారు. ఇటీవల కాలంలో ఓవర్ నైట్ లో స్టార్డం సొంతం చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ అందాల ముద్దుగుమ్మలు బిజీగా గడిపేస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు హీరోలకు తగ్గట్లుగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా హీరోయిన్లతో పాటు సీరియల్ హీరోయిన్లు కూడా బాగా ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్ లకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నారు సీరియల్ హీరోయిన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఒక సీరియల్ హీరోయిన్ కు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉంది. ఆమెకు ఎంతలా క్రేజ్ ఉందంటే స్టార్ హీరోలకు మించిన ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఈ సీరియల్ నటికి ఉన్నారు అంటే నమ్మశక్యం కాదు. ఈ అమ్మడుకు ఆస్తిపాస్తులు కూడా స్టార్ హీరోలకు మించి ఉన్నాయి. కేవలం 23 ఏళ్లు ఉన్నా ఈ సీరియల్ బ్యూటీ కి ఆస్తులు మాత్రం రూ. 250 కోట్లకు పైగానే ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సీరియల్ నటి ఈమెనే అని చెప్పొచ్చు. ఈమె మరెవరో కాదు బాలీవుడ్ నటి జన్నత్ జుబేర్.

    అతి చిన్న వయసులోనే ఈమె తిరుగులేని స్టార్ డంను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో జన్నత్ జుబేరుకు విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో మిలియన్స్ లో ఈమెను ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను కూడా ఫాలోవర్స్ విషయంలో ఈమె బీట్ చేసింది. ఇంస్టాగ్రామ్ ఖాతాలో జన్నత్ జుబేర్ కు 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బుల్లితెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. బుల్లితెర మీద హిందీలో ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించింది.

    అలాగే హీరోయిన్ రాణి ముఖర్జీ నటించిన హిచ్ కి సినిమాలో జన్నత్ జుబేర్ నటించింది. సీరియల్స్ తో పాటు టీవీ షోలో కూడా పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతి చిన్న వయస్సులోనే జన్నత్ జుబేర్ కు స్టార్ గా మంచి గుర్తింపు లభించింది.సోషల్ మీడియా లో కూడా ఈమె బాగా ఆక్టివ్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో జన్నత్ జుబేర్ షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వాల్సిందే అని తెలుస్తుంది.