https://oktelugu.com/

#90s : #90స్ కి సీక్వెల్ రెడీ అయిందిగా… హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే... అలాగే యంగ్ డైరెక్టర్స్ కూడా కొత్త కథలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 15, 2025 / 01:32 PM IST

    #90s

    Follow us on

    #90s : 2024 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ఈటీవీ విన్ లో #90 స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ చాలా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా అందులో నటించిన నటీనటులకు కూడా చాలా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక దానికి సీక్వెల్ గా ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో ను ‘ప్రొడక్షన్ 32 అన్ ఫినిష్ఢ్ స్టోరీగా ఈ సినిమాని సితార ఎన్టీయార్ టైన్ మెంట్స్ లో ఆదిత్య హాసన్ తెరికెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో రాబోతుంది అంటూ ఒక వీడియో అయితే అనౌన్స్ చేశారు. ఇక దాంతో పాటుగా శివాజీ చిన్న కొడుకు గా చేసిన ఆదిత్య క్యారెక్టర్ కి సంబంధించిన ఒక లవ్ స్టోరీ ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. 90 స్ స్టోరీ 2007 లో నడిస్తే ఈ సీక్వెల్ మాత్రం 2017 వ సంవత్సరం బ్యాడ్రాప్ లో జరిగిన స్టోరీ గా రాబోతుంది. అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సినిమా స్టోరీని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు రోషన్ చేసిన ఆదిత్య క్యారెక్టర్ లో రోషన్ ప్లేస్ లో ఇప్పుడు ఆనంద్ దేవరకొండ నటించబోతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సిరీస్ తొందర్లోనే థియేటర్ లోకి రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది. తద్వారా దర్శకుడు ఆదిత్య హాసన్ కి ఎలాంటి పేరు రాబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక వీళ్ళు రిలీజ్ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులందరిని మెప్పిస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.

    మరి ఏది ఏమైనా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని ఆదిత్య హాసన్ కోరుకుంటున్నాడు. ఇక దాంతోపాటుగా ఆనంద్ దేవరకొండకు జోడిగా ఇందులో వైష్ణవి నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా వీళ్ళ కాంబోలో ఇంతకుముందు వచ్చిన బేబీ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

    మరి ఈ సినిమా కూడా అలాంటి విజయాన్ని సాధించి వాళ్లకు మంచి గుర్తింపును తీసుకురాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తుంది అనేది…