Eagle: ఈగల్ సినిమాను వెంటాడుతున్న సెంటిమెంట్… భయాందోళనలో అభిమానులు…

ఎందుకంటే ఇంతకు ముందే రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ సినిమా ట్రైలర్ మాత్రం చూడడానికి చాలా కొత్తగా,ఫ్రెష్ ఫీల్ ఉండే విధంగా కట్ చేసినప్పటికీ సినిమాలో మాత్రం పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.

Written By: Gopi, Updated On : December 21, 2023 11:31 am

Eagle

Follow us on

Eagle: రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈగల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా సంక్రాంతి కనుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ట్రైలర్ ని చూస్తుంటే రవితేజ ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రవితేజ తన నటన తో ఎంతవరకు మెప్పిస్తాడు అనేది మాత్రం సగటు ప్రేక్షకుడికి అర్థం కావడం లేదు.

ఎందుకంటే ఇంతకు ముందే రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ సినిమా ట్రైలర్ మాత్రం చూడడానికి చాలా కొత్తగా,ఫ్రెష్ ఫీల్ ఉండే విధంగా కట్ చేసినప్పటికీ సినిమాలో మాత్రం పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఇప్పుడు ఈగల్ ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది అయినప్పటికీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందా ఏంటి అనేది రవితేజ అభిమానులకు మాత్రం అర్థం కావడం లేదు.

ఎందుకంటే రవితేజ సినిమాలు ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే మాత్రం సినిమా పెద్దగా ఆడడం లేదు. ఇంతకు ముందు రావణాసుర ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అయినప్పటికీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇప్పుడు ఈగల్ సినిమాకి కూడా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా అభిమానులను తీవ్రమైన భయాందోళనలకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మీద రవితేజ గాని, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గాని ఇద్దరూ కూడా చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితేనే అటు రవితేజ కి మార్కెట్ పరంగా మరికొంత వరకు ప్లస్ అవుతుంది.అలాగే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి కూడా మరొక సినిమా డైరెక్షన్ చేసే అవకాశం అయితే వస్తుంది.

కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే తప్ప వీళ్ళిద్దరికీ మంచి పేరు అయితే రాదు. ఇక ఇంతకుముందు రవితేజ చేసిన వరుస సినిమాలు ఆడక పోయేసరికి ఈ సినిమాల మీదనే రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక కార్తీక్ ఘట్టమనేని కూడా ఇంతకుముందు నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా పెద్దగా ఆడకపోయేసరికి అప్పటినుంచి ఇప్పటివరకు ఈయన ఏ సినిమా కూడా డైరెక్షన్ చేయలేదు. అయితే స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని తెలుగులో చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు…ఇక సూర్య వర్సెస్ సూర్య సినిమా తో డైరెక్టర్ గా మారాడు…