Game Changer vs Tandel : గేమ్ చేంజర్’ చిత్రం నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, మరో లెవెల్ లో మాత్రం క్లిక్ అవ్వలేదు. ఒక్క పాట కూడా చార్ట్ బస్టర్ రేంజ్ లో పేలలేదు. ‘గేమ్ చేంజర్’ తో పోలిస్తే సంక్రాంతి విడుదల అవుతున్న వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రం చాలా చిన్న చిన్నది అనే చెప్పాలి. కానీ ఈ సినిమా నుండి విడుదలైన ‘గోదారి గట్టు’ పాట చార్ట్ బస్టర్. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసిన ఈ పాట రీసౌండ్ వచ్చేలా వినిపిస్తుంది. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకి 57 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ చార్ట్ బస్టర్ అనేది. ‘గేమ్ చేంజర్’ లో ఇప్పటి వరకు విడుదలైన పాటలలో ఒక్క పాటకి కూడా 50 మిలియన్ వ్యూస్ రాకపోవడం గమనార్హం.
అన్ని పాటలకు 40 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కానీ మొదటి రోజే ఆ పాటలకు 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఆ 20 మిలియన్ వ్యూస్ లో సగానికి పైగా యాడ్స్ ద్వారా వచ్చినవే. అవన్నీ పరిగణలోకి తీసుకుంటే ‘గేమ్ చేంజర్’ సాంగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ కేవలం యావరేజ్ అని చెప్పొచ్చు. ‘గేమ్ చేంజర్’ కంటే ఎక్కువగా నాగ చైతన్య హీరో గా నటించిన ‘తండేల్’ చిత్రం లోని ‘బుజ్జి తల్లి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు యూట్యూబ్ లో ఇప్పటి వరకు 41 మిలియన్ వ్యూస్ వచ్చాయి. త్వరలో ఈ పాట కూడా ‘గేమ్ చేంజర్’ సాంగ్స్ ని దాటేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ‘గేమ్ చేంజర్’ లో ఇప్పటి వరకు విడుదలైన పాటలలో ‘జరగండి..జరగండి’ కి మాత్రమే మంచి రెస్పాన్స్ వచ్చింది.
రీసెంట్ గానే ఈ పాట 50 మిలియన్ వ్యూస్ మార్కుని అందుకుంది. ఈ పాట తర్వాత ‘నానా హైరానా’ పాటకు 46 మిలియన్ వ్యూస్ రాగా, ‘రా మచ్చ మచ్చ’ పాటకు 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ‘డోప్’ సాంగ్ కి 26 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొదటి రోజు తర్వాత కేవలం నాలుగు మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. పైన చెప్పిన రెండు సినిమాల పాటలకు రోజుకి మూడు నుండి నాలుగు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. దీంతో ఎక్కడ పొరపాటు జరిగింది అనే విషయం లో విశ్లేషిస్తున్నారు అభిమానులు. శంకర్ మార్క్ కి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చే ఆలోచనలో థమన్, తన మార్కుని పూర్తిగా పక్కన పెట్టడం వల్లే, ‘గేమ్ చేంజర్’ లోని పాటలు అనుకున్న రేంజ్ కి చేరుకోలేదని అంటున్నారు. మరి థియేటర్స్ లో ఈ పాటలకు ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.