https://oktelugu.com/

Pushpa 2: కేవలం 3 గంటలు మాత్రమే..’పుష్ప : ది రూల్ ‘ గురించి సెన్సేషనల్ అప్డేట్!

ప్రస్తుతానికి వీళ్ళ మధ్య ఉన్న ఆ గొడవ సర్దుమణిగింది. షూటింగ్ సజావుగానే సాగుతుంది. ఇప్పటీకే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ మొత్తం పూర్తి చేశారట. ఒక ఐటెం సాంగ్ తో పాటు, 20 రోజుల టాకీ పార్ట్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. అక్టోబర్ నెలలో అది కూడా పూర్తి చేసి, సెకండ్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ని కూడా పూర్తి చేయాలనీ చూస్తున్నారట.

Written By:
  • Vicky
  • , Updated On : September 11, 2024 / 05:51 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: రాజమౌళి తర్వాత మంచి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న వారిలో ఒకరు సుకుమార్. ఈయన సినిమాలో ప్రతీ సన్నివేశం డిటైలింగ్ చూస్తే ఎంత హోమ్ వర్క్ చేసాడో అనే విషయం అర్థం అవుతుంది. కేరీర్ లో ‘ఆర్య’, ‘రంగస్థలం’ మరియు ‘పుష్ప’ చిత్రాలు తప్ప ఈయన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు, అయినా కూడా యూత్ లో ఈయన సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా హీరోల నుండి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని రాబట్టుకోవడంలో సుకుమార్ ని మించిన వారు ఇండస్ట్రీ లో లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈయనతో షూటింగ్ చాలా తలనొప్పితో కూడుకున్న పని అని అందరూ అంటుంటారు. ఏ సన్నివేశం కూడా ఒక పట్టాన ఈయనకు నచ్చదు. ఒక సన్నివేశానికి నాలుగైదు వెర్షన్స్ తియ్యడం ఈయన స్టైల్. అల్లు అర్జున్ కి కూడా అందుకే చిరాకు పుట్టి రీసెంట్ గా షూటింగ్ కి రాను అంటూ విదేశాలకు వెళ్లిపోయాడని అందరూ అంటూ ఉంటారు.

    అయితే ప్రస్తుతానికి వీళ్ళ మధ్య ఉన్న ఆ గొడవ సర్దుమణిగింది. షూటింగ్ సజావుగానే సాగుతుంది. ఇప్పటీకే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ మొత్తం పూర్తి చేశారట. ఒక ఐటెం సాంగ్ తో పాటు, 20 రోజుల టాకీ పార్ట్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. అక్టోబర్ నెలలో అది కూడా పూర్తి చేసి, సెకండ్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ని కూడా పూర్తి చేయాలనీ చూస్తున్నారట. ఐటెం సాంగ్ సిద్ధంగా ఉంది కానీ, ఎవరితో ఈ పాట చేయించాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదట. శ్రీలీల కోసం తెగ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా నిడివి కూడా ఫిక్స్ చేసేసారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 3 గంటలు ఉంటుందని సమాచారం. సుకుమార్ సినిమాలను బాగా పరిశీలిస్తే ప్రతీ సినిమా నిడివి 3 గంటలు ఉంటుంది. రంగస్థలం, పుష్ప చిత్రాలు కూడా అంతే. నిడివి ఎక్కువ ఉండడం వల్ల థియేట్రికల్ రన్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. సినిమా స్క్రీన్ ప్లే మొత్తం ఆయన అంత గ్రిప్పింగ్ గా నడిపిస్తాడు కాబట్టి మూవీ లెంగ్త్ సమస్య ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా విషయంలో కూడా అంతే.

    ఇకపోతే ఫహద్ ఫాజిల్ కి సంబంధించిన సన్నివేశాలే ఎక్కువ బ్యాలన్స్ ఉండదట. ఆయన సన్నివేశాలను ఎట్టి పరిస్థితిలో అక్టోబర్ లో పూర్తి చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఆయన డేట్స్ ఇన్ని రోజులు దొరకకపోవడం వల్లే వాయిదా పడిందని, లేకుంటే ముందు అనుకున్న విధంగానే ఆగస్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేసేవారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే ఈ సినిమా పై అల్లు అర్జున్ చాలా నమ్మకం తో ఉండడాన్ని మనం గమనించొచ్చు. ఉన్న భారీ అంచనాలను ఈ సినిమా చేరుకుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్లకు లిమిట్ ఉండదని అంటున్నారు ట్రేడ్ పండితులు.