Sensational Tollywood Combination: టాలీవుడ్ లో #RRR లాంటి మల్టీస్టార్ర్ర్ ఇప్పట్లో మళ్ళీ రాదు ఏమో అని అందరూ అనుకున్నారు..కానీ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే అతి త్వరలోనే మళ్ళీ అలాంటి సెన్సషనల్ కాంబినేషన్ ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం చూడబోతుంది అని తెలుస్తుంది..సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మన టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్లిద్దరి సినిమాలు వచ్చాయి అంటే అమెరికా నుండి అనకాపల్లి వరుకు పండగ వాతావరణం నెలకొంటుంది..వీళ్ళ సినిమాలు హిట్ అయితే మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రతి రోజు పండగే అని చెప్పొచ్చు..అలాంటిది వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో కాలం నుండి సోషల్ మీడియా లో ఊహించుకుంటూ ఉన్నారు ..కానీ వీళ్ళ కాంబినేషన్ లో ఈమధ్య కాలం లో సినిమా కాదు కదా, కనీసం ఒక్క ఫోటో కూడా రాలేదు..ఇది ఈ ఇద్దరినీ అభిమానించే అభిమానులకు చాలా విచారం కి గురి చేసే విషయం, కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక్క వార్త ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న ఈ ఇద్దరి హీరో అభిమానులకు పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే ఈ ఇద్దరి హీరోలను పెట్టి ఒక్క మంచి కామెడీ ఎంటర్టైనర్ ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అట..ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వర్క్ ని కూడా ప్రారంభించినట్టు సమాచారం..త్రివిక్రమ్ శ్రీనివాస్ అటు పవన్ కళ్యాణ్ కి ఇటు మహేష్ బాబు కి కామన్ గా బెస్ట్ ఫ్రెండ్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఇద్దరి హీరోలతో త్రివిక్రమ్ గారికి ఉన్న సన్నిహిత్యమే వేరు అని చెప్పొచ్చు ..అలా త్రివిక్రమ్ కి వీళ్ళిద్దరితో ఉన్న సాన్నిహిత్యం కారణం గానే ఈ సినిమా సెట్ అయ్యింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఇప్పటి వరుకు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ పవర్ స్టార్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు..అప్పట్లో ఇది ఒక్క సెన్సేషన్ అని చెప్పొచ్చు ..ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ కారణంగా ఏకంగా ఒక్క మల్టీస్టార్ర్ర్ చెయ్యబోతున్నాడు అనే వార్త రావడం తో సోషల్ మీడియా లో పవన్ మరియు మహేష్ అభిమానులు ఆనందిస్తున్నారు.
Also Read: సుడిగాలి సుధీర్ సంపాదన ఎంతో తెలుసా..? స్టార్ హీరోలు కూడా పనికిరారు
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే ..కేవలం ఒక్క పాట మినహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వం లో సోలో హీరో గా ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోనుంది..ఈ రెండు సినిమాల తర్వాత ఆయన రాజమౌళి తో కూడా ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఇవి అన్ని పూర్తి అయితే కానీ పవన్ – మహేష్ మల్టీస్టార్ర్ర్ సినిమా పట్టాలెక్కదు..మరోపక్క పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ తో కలిసి హరిహర వీర మల్లు అనే పీరియాడిక్ సినిమా తీస్తున్నాడు..దీనితో పాటుగా హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది..ఈ రెండు సినిమాల తర్వాత ఆయన 2024 ఎన్నికల కోసం జనాల్లోకి వెళ్లనున్నారు..అన్ని విధాలుగా ఆయన ఖాళీ అయినప్పుడే ఈ సినిమా పట్టాలెక్కనుంది..అంటే ఈ మల్టీస్టార్ర్ర్ సెట్స్ పైకి వెళ్లడానికి సుమారు రెండేళ్ల పైనే సమయం పట్టొచ్చు కానీ కచ్చితంగా ఈ కాంబినేషన్ ఉంటుంది అని ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న వార్త.
Also Read: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల బిజినెస్ ని దాటేసిన విజయ్ దేవరకొండ లైగర్