Sensational Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(BIGG BOSS TELUGU SEASON 9) త్వరలో ప్రసారం కానుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యిందని తెలుస్తుంది. హౌస్లోకి వెళ్లే సెలెబ్స్ వీరే అంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. కంటెస్టెంట్స్ ఎంపికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందట. అదేమిటో చూద్దాం..
ఎనిమిది సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు… సీజన్ 9కి సిద్ధం అవుతుంది. ఇటీవల ప్రోమో కూడా విడుదల చేశారు. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారని సమాచారం. సీజన్ 3 నుండి వరుసగా ఆరు సీజన్స్ కి నాగార్జున హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. సీజన్ 8 విన్నర్ గా కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ టైటిల్ అందుకున్నాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నర్ గా నిలిచాడు.
Also Read :రాజమౌళి – పూరి జగన్నాధ్ ఇండస్ట్రీ కి రాక ముందు నుంచే ఫ్రెండ్సా..? సంచలన విషయం చెప్పిన పూరి…
ఇక సీజన్ 9 సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుందని సమాచారం. హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఖరారు అయ్యిందట. ఈ లిస్ట్ లో బిగ్ బాస్ 7 రన్నర్ అమర్ దీప్ భార్య తేజస్విని ఉన్నారట. అలాగే మరికొందరు సీరియల్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. దేబ్జానీ, కావ్యశ్రీ, జబర్దస్త్ రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మానియేల్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, యాంకర్ నిఖిల్, సింగర్ సాకేత్, నటి కల్పికా గణేష్, కమెడియన్ యాదమరాజు ఎంపిక అయ్యారట. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య సైతం ఎంపికైంది అంటూ వార్తలు వస్తున్నాయి.
కాగా కామన్ మెన్ కేటగిరీలో కొందరికి ప్రవేశం ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. షోలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ షోకి ఉన్న క్రేజ్ రీత్యా లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయని సమాచారం. సాధారణంగా ఒకరిద్దరు కామన్ మెన్ కి అవకాశం ఉంటుంది. అనూహ్యంగా 9 మంది కామన్ మెన్ కేటగిరీలో కంటెస్ట్ చేస్తారనే న్యూస్ సంచలనం రేపుతోంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ లో 9 మంది కామన్ మెన్ కేటగిరీకి చెందివారు కాగా, మిగతా 9 మంది సెలెబ్స్ హౌస్లోకి ప్రవేశిస్తారట.
Also Read: 20 కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కి వెళ్ళను అంటున్న నటుడు, కారణం తెలుసా?
ఇదే నిజం అయితే సంచలనమే అవుతుంది. పైన పేర్కొన్న సెలెబ్స్ లో కొందరు మిస్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. 9 మంది సామాన్యులు హౌస్లోకి ప్రవేశిస్తే.. ఈ రికార్డు రిపీట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు రహస్యమే. మరి చూడాలి ఈసారి హౌస్లోకి ప్రవేశించే కంటెస్టెంట్స్ ఎవరో?