Allu Arjun Arrested: అల్లు అర్జున్ అరెస్ట్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇందులో రాజకీయ కోణం ఉందనే వాదన గట్టిగా వినిపిస్తుంది. అల్లు అర్జున్ కి జైలు కి పంపాలనే శుక్రవారం అరెస్ట్ చేశారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు దినాలు కావడంతో ఎలాగైనా అల్లు అర్జున్ జైలు జీవితం గడిపేలా ప్రణాళికలు వేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తొక్కిసలాటలో మహిళ మరణించడం విచారకరం. అయితే ఆ ఘటనకు పూర్తిగా అల్లు అర్జున్ ని బాధ్యుడిని చేసి అరెస్ట్ చేయడం అన్యాయం అంటున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ ని చిత్ర ప్రముఖులు నాని, నితిన్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, రష్మిక మందానతో పాటు పలువురు ఖండించారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రముఖ నేతలు సైతం తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సీనియర్ రచయిత చిన్ని కృష్ణ మండిపడ్డారు. అల్లు అర్జున్ అరెస్ట్ కి కారణమైన వారు నాశనమైపోతారంటూ శాపనార్థాలు పెట్టాడు.
చిన్ని కృష్ణ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడారు. నేను అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రికి కథ రాశాను. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం. నిన్న 12 గంటల నుండి నేను అన్నం కూడా తినలేదు. గంగోత్రి వంటి పవిత్రమైన అల్లు అర్జున్ ని మలినం చేయాలని చూశారు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనకున్న ప్రభుత్వం అయిన వ్యక్తులు అయినా నాశనమైపోతారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదని చిన్ని కృష్ణ అన్నారు. చిన్ని కృష్ణ వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి.
చిన్ని కృష్ణ గంగోత్రి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను సమకూర్చారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. దాని దృష్టిలో అందరూ సమానులే అన్నారు. అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హంగామా చేయకపోతే ఈ ప్రమాదం జరిగేది కాదు. అల్లు అర్జున్ కి మూవీ చూడాలని ఉంటే ఇంట్లో వేసుకుని చూడాలి. ఒకవేళ థియేటర్ లో చూడాలనిపిస్తే… పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, అన్నారు.