Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు…తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్ని ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారుతున్నాయి. బాలయ్య బాబుకి షార్ట్ టెంపర్ ఉంటుందని చాలా తొందరగా కోపం వస్తుందని తన దగ్గర ఎవరు ఉంటే వాళ్ళని కోపంతో కొడతాడంటూ అతని మీద చాలా రూమర్లైతే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అవి నిజమని ప్రూవ్ అయినప్పటికి ఆయన ఎందుకు కొడతాడు. అవతలి వ్యక్తిని తనంతట తానే ఎందుకు ఇబ్బంది పెడతాడనే ధోరణిలో మాత్రం ఎవ్వరు ఆలోచించడం లేదంటూ పలువురు సినిమా మేధావులు గతంలో కొన్ని కామెంట్లు చేశారు. బాలయ్య కోపం వస్తే కొడతాడు అనేది ఇండస్ట్రీ లో అందరికి తెలిసిందే కాబట్టి తనతో సినిమాలు చేసే దర్శకులు సైతం ఆయనతో చాలా జాగ్రత్తగా ఉంటారు, కొంచెం తేడా జరిగినా కూడా బాలయ్య కోపానికి బలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…అలాంటి బాలయ్య బాబుని ఒక దర్శకుడు కొట్టగానే విషయం మనలో చాలా మందికి తెలియదు.
ఇంతకి ఆ దర్శకుడు ఎవరు ఎందువల్ల బాలయ్య బాబు మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం…బాలయ్య బాబు సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో బాలయ్య బాబు అనుకోకుండా నటించాల్సి వచ్చింది.
ముందుగా ఆ క్యారెక్టర్ కి నటుడు చంద్రమోహన్ ని అనుకున్నప్పటికి చివరి నిమిషంలో ఎన్టీఆర్ చంద్రమోహన్ ని తప్పించి ఆ క్యారెక్టర్ కోసం బాలయ్య ను తీసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే బాలయ్యకి ఇది మొదటి సినిమా కావడంతో బాలయ్య కు అప్పటికే నటనలో మెలుకువలు నేర్పిన ఎన్టీఆర్ సెట్ లో అందరి ముందు బాలయ్య కొంచెం తడబడటంతో డైరెక్టర్ లాల్ ముందే ఎన్టీఆర్ బాలయ్య మీద చేయి చేసుకున్నాడట…
దీని మీద అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక సీనియర్ ఎన్టీఆర్ కూడా ‘దానవీరసూర కర్ణ’ సినిమాకి అలాగే మరికొన్ని మూవీస్ కి దర్శకత్వం వహించాడు. కాబట్టి బాలయ్య బాబును కొట్టిన దర్శకుడి గా సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో వార్తల్లో నిలిచాడు. ఇక ఏది ఏమైనా కూడా సీనియర్ ఎన్టీఆర్ క్రమశిక్షణలో బాలయ్య బాబు పెరిగాడు. కాబట్టి తను కూడా పని పట్ల నిబద్ధతతో ఉండాలని నేర్చుకున్నాడు. పనిలో ఏదైనా తప్పు జరిగితే తన పై స్థాయి వారు తనను దండించిన అందులో తప్పులేదు అంటూ బాలయ్య అప్పటినుంచి ఇప్పటివరకు అందరికి చెబుతూనే ఉంటాడు…