Allu Arjun: అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దాదాపు వంద కోట్లు తీసుకుంటున్న హీరో. మరి అలాంటి హీరో పక్కన ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఫేడ్ అవుటై క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న ఓ హీరోయిన్ బన్నీ పక్కన నటించాలనే తన ఆశను బయటపెట్టింది. అడిగిందే తడవుగా ఆమెకు హామీ ఇచ్చాడు బన్నీ. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియమణి. కన్నడ భామ ప్రియమణి కెరీర్ మొదలైంది తెలుగులోనే. ఆమె మొదటి చిత్రం ఎవరే అతగాడు. 2003లో ఈ చిత్రం విడుదలైంది.
దర్శకుడు రాజమౌళి యమదొంగ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో తెరకెక్కిన యమదొంగ సూపర్ హిట్ కొట్టింది. యమదొంగ కంటే ముందు తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో డీగ్లామర్ రోల్ చేసింది. ఈ పాత్రకు గాను ఏకంగా నేషనల్ అవార్డు కొల్లగొట్టింది. పలు భాషల్లో విభిన్నమైన పాత్రలు చేసింది. ప్రస్తుతం హీరోయిన్ గా ఆమె ఫేడ్ అవుట్ అయ్యింది. దాంతో క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది.
ప్రియమణి అత్యంత డిమాండ్ ఉన్న నటి. పలు భాషల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తుంది. అయితే ఈ భామకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అట. ఆయన పక్కన నటించాలనేది ఆమె కోరిక అట. ఈ విషయాన్ని ఓ రియాలిటీ షోలో ప్రియమణి బయటపెట్టింది. అక్కడే ఉన్న అల్లు అర్జున్… ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
నా పక్కన నటించాలన్న ఆశ వదులుకోకు. తప్పకుండా నటిస్తావు. నువ్వు సన్నబడ్డావు. చాలా హాట్ గా కూడా ఉన్నావంటూ… ఆమెపై పొగడ్తలు కురిపించాడు. అల్లు అర్జున్ హీరోయిన్ ప్రియమణికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏదో ఒక చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించే అవకాశం లేకపోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా దేవర మూవీలో ప్రియమణి కూడా నటిస్తుందనే టాక్ ఉంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా… తండ్రి పాత్రకు జంటగా ఆమె చేస్తున్నారనే కథనాలు వెలువడ్డాయి. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో…
Web Title: Senior heroines wish fulfilling by allu arjun
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com