Allu Arjun- Vijayalakshmi: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తెలియదని సీనియర్ నటి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ వైరల్ కావడంతో పాటు ఒకింత ఆయన అభిమానులు నొచ్చుకునేలా చేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్స్ తో జతకట్టారు హీరోయిన్ ఎల్. విజయలక్ష్మి. ఆ జెనరేషన్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాల్యం నుండి విజయలక్ష్మికి డాన్స్ పట్ల ఆసక్తి ఉండేది. అది గమనించిన ఆమె నాన్నగారు భరతనాట్యం నేర్పించారు. 9 ఏళ్లకే స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఎల్ విజయలక్ష్మి గొప్ప డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు.

సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి నటిగా కూడా పాపులారిటీ అందుకున్నారు. తెలుగు, తమిళ,మలయాళ, హిందీ భాషల్లో విజయలక్ష్మి చిత్రాలు చేశారు. ఎన్టీఆర్ ఆమె పట్ల చాలా అభిమానం చూపేవారట. సినిమా నేపథ్యంలో కాకపోవడంతో ఎన్టీఆర్ తో ఎలాంటి పరిచయం లేదు. ఆయనతో మొదటి సినిమా అన్నప్పుడు చాలా భయం వేసింది. అయితే ఆయనే స్వయంగా దగ్గరకు పిలిచి, పలకరించి కూర్చో అన్నారు. దాంతో నా బిడియం పోయిందని విజయలక్ష్మి చెప్పుకొచ్చారు.
1969లో సైంటిస్ట్ సురాజిత్ కుమార్ ని ఎల్ విజయలక్ష్మి వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం భర్తతో పాటు ఆమె అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. ఇటీవల ఆమె ఇండియాకు వచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఎన్టీఆర్ అవార్డుతో ఆమెను సత్కరించారు. సభ ఏర్పాటు చేసి బాలయ్య చేతుల మీదుగా అవార్డు అందించారు.

కాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయలక్ష్మి ప్రస్తుత తెలుగు సినిమా గురించి మాట్లాడారు. యాంకర్ ఆమెను పుష్ప సినిమా చూశారా? అని అడగ్గా… చూశాను, కాకపోతే ఆ హీరో ఎవరో తెలియదు అని అన్నారు. ఆమె సమాధానానికి యాంకర్ షాక్ అయ్యారు. ఆయన అల్లు రామలింగయ్య మనవడు అనగానే విజయలక్ష్మి ఆశ్చర్యపోయారు. ఈ మధ్య తెలియక ఆ హీరో ఎవరని అడుగుతుంటే… ఎన్టీఆర్ మనవడు, ఏఎన్నార్ మనవడు అని ఇలానే చెబుతున్నారన్నారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆమెది ఈ జనరేషన్ కాదు. అందులోనూ అమెరికాలో ఉంటున్నారు.