https://oktelugu.com/

Mahesh Babu: ఆ సీనియర్ హీరోయిన్ మహేష్ కి పిన్ని అట

Mahesh Babu:  ‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ సినిమాకు సంబంధించిన తాజాగా ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమిటి ఆ రూమర్ అంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్‌ పిన్ని పాత్ర అని టాక్. మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 6, 2022 / 03:22 PM IST
    Follow us on

    Mahesh Babu:  ‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ సినిమాకు సంబంధించిన తాజాగా ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమిటి ఆ రూమర్ అంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్‌ పిన్ని పాత్ర అని టాక్. మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

    Mahesh Babu

    అన్నట్టు మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్రను పోషించనున్నాడట. మహేష్ కు మామయ్యగా చాలా వైవిధ్యంగా త్రివిక్రమ్, మోహన్ లాల్ పాత్రను డిజైన్ చేశాడని ఓ పుకారు బాగా వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం ఉందనేది తెలియాలి అంటే.. చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఇటీవలే ఈ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్.

    Also Read:  ఆ విషయంలో నాకు శ్రీదేవే స్ఫూర్తి – ఆలియా భట్

    కాగా మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మార్చి నుంచి షూట్‌ ను ప్రారంభించాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

    Mahesh Babu

     

    అసలు మహేష్ – త్రివిక్రమ్ కలయిక అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టు పదకొండు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండటం, పైగా మొదటసారి ఇద్దరు పాన్ ఇండియా సినిమా కలిసి చేస్తుండటం.. మొత్తానికి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

    Tags