Senior Hero Naresh: గత వారం రోజులుగా నరేష్-పవిత్ర లోకేష్ వివాహం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఇక వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారనేది తాజా సమాచారం. నరేష్, పవిత్ర లోకేష్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నా నరేష్ నోరు మెదపలేదు. తన నాలుగో పెళ్లి వార్తలో నిజం ఉందో లేదో క్లారిటీ ఇవ్వలేదు. సహజంగా నరేష్ ఇలాంటి పుకార్లకు వెంటనే స్పందిస్తారు. వీడియో బైట్స్ విడుదల చేసి విషయం వివరిస్తారు.

అయితే కొంచెం లేట్ అయినా నరేష్ స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ నాలుగో పెళ్లి వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ… సినిమా వాళ్లే ఎక్కువ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఉంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. సమాజంలో ఎవరూ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా?. సినిమా వాళ్లు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ పెళ్లిళ్ల గురించి బయటికి తెలుస్తుంది. పెళ్లి అనేది చిన్న విషయం కాదు. పెళ్లి జీవితం. వివాహ బంధంలో మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప మరొక వివాహం చేసుకోవాలనే ఆలోచన రాదు.
Also Read: Bandla Ganesh: పూరి అన్నా డైలాగ్ చెప్పడం రాని వాళ్ళను స్టార్స్ చేశావ్… కలకలం రేపుతున్న బండ్ల స్పీచ్!

ఇప్పటి వివాహ వ్యవస్థ సరైనది కాదు. పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే దంపతులు విడాకులు అడుగుతున్నారు. ఒకప్పుడు ఒక ఫ్యామిలీ కోర్ట్ ఉండేది. ఇప్పుడు ఎనిమిది ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చాయి. ఆర్టిస్ట్ జీవితానికి నిలకడ ఉండదు. టైమింగ్స్ అనేవి ఉండవు. నేను నెలలో 28 రోజులు షూటింగ్స్ కోసం బయటే ఉంటాను. నా వృత్తిపరమైన జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్లే నాతో ఉండగలరు. అర్థం చేసుకోలేని వాళ్ళు వెళ్ళిపోతారు. మూడుసార్లు విడాకులు అందుకే అయ్యాయి. ఇలాంటి కారణాలతోనే వాళ్లకు నేను విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. నా మొదటిభార్య సినిమా. సినిమా కోసం నేను ఏదైనా చేస్తా అంటూ ముగించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకున్నట్లు నేరుగా చెప్పకున్నా.. నరేష్ వ్యాఖ్యల ద్వారా ఆయన నాలుగో వివాహం చేసుకున్నట్లు క్లారిటీ వచ్చింది.
Also Read:Mohan Babu Assets: మోహన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
[…] […]