Homeఎంటర్టైన్మెంట్Arjun Mother Passed Away: ప్రముఖ హీరో అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం..శోకసంద్రం లో టాలీవుడ్

Arjun Mother Passed Away: ప్రముఖ హీరో అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం..శోకసంద్రం లో టాలీవుడ్

Arjun Mother Passed Away: ప్రముఖ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ గారి ఇంట్లో తీవ్రమైన విషాదం నెలకొంది..ఆయన కన్న తల్లి లష్మి దేవమ్మ గారు ఈరోజు ఉదయం తన స్వగృహం లో కన్నుమూశారు..వృత్తి రీత్యా టీచర్ గా పని చేసిన ఈమెకి 85 ఏళ్ళ వయస్సు ఉంటుంది..కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతున్న లక్ష్మి దేవమ్మ గారు..ప్రాథమిక చికిత్స చేయించుకుంటూ వస్తున్నారు..అయితే ఈరోజు ఆమె పరిస్థితి తీవ్రంగా విషమించడం తో కన్ను మూసారు..ఆమె మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ మరియు కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులందరూ అర్జున్ కి సంతాపం వ్యక్తం చేసారు..అర్జున్ అన్ని ప్రాంతీయ బాషలలో హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..మన టాలీవుడ్ లో కూడా ఎంతో మంది డైరెక్టర్స్ మరియు నటీనటులతో అర్జున్ కి మంచి సాన్నిహిత్య సంబంధం ఉన్నది..అందుకే ఆయన ఇంట ఏ కష్టం వచ్చిన తమ ఇంట్లో కష్టం వచ్చినట్టు చలించిపోతారు..అర్జున్ కి మన టాలీవుడ్ లో జగపతి బాబు ప్రాణ స్నేహితుడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈరోజు అర్జున్ గారి తల్లి చనిపోయిన విషయం తెలుసుకున్న జగపతి బాబు ఎక్కడో విదేశాల్లో జరుగుతున్నా షూటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని అర్జున్ ఇంటికి బయలుదేరాడు.

Arjun Mother Passed Away
Arjun, Mother Lakshmi Devamma

ఇక అర్జున్ హీరో గా తన కెరీర్ అయిపోయిందని గమనించిన వెంటనే క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి షిఫ్ట్ అయిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..తెలుగు, తమిళం , మలయాళం మరియు కన్నడం అని తేడా లేకుండా అన్ని ప్రాంతీయ బాషలలో అర్జున్ క్యారక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రతి సినిమాకి తనలోని కొత్త కోణం ని ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నాడు..హీరో గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు గా విజయవంతమైన కెరీర్ ని ఎంజాయ్ చేసిన అర్జున్, ఇప్పుడు డైరెక్టర్ గా కూడా సరికొత్త అవతారం ఎత్తాడు..యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పర్చుకున్న విశ్వక్ సేన్ ని హీరో గా పెట్టి ఆయన దర్శకత్వం వహించబోయ్యే సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలను జరుపుకుంది.

Also Read: Dhanush: రామ్ చరణ్ మరియు ప్రభాస్ లు నాలాగా మోసపోకూడదని కోరుకుంటున్నాను: ధనుష్

Arjun Mother Passed Away
Arjun

ఈ పూజ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యి క్లాప్ కొట్టాడు..ఈ సినిమాలో హీరోయిన్ గా అర్జున్ గారి కూతురు ఐశ్వర్య నటిస్తుంది..ఐశ్వర్య ఇదివరకే తమిళం లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..ఇక అర్జున్ ప్రాణ స్నేహితుడు జగపతి బాబు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు..అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Also Read:Samantha- Naga Chaitanya: విడాకులు తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న సమంత – నాగచైతన్య
Recommended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular