https://oktelugu.com/

Satyadev : జబర్దస్త్ షోలో సత్యదేవ్ కి అవమానం, చైర్ తీసేయండన్న సీనియర్ కమెడియన్!

తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జబర్దస్త్ షోకి వచ్చిన సత్యదేవ్ కి షాక్ తగిలింది. ఆయనకు వేసిన కుర్చీ తీసేయండి అంటూ ఓ సీనియర్ కమెడియన్ అవమానించాడు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 21, 2024 / 08:40 PM IST

    Satyadev

    Follow us on

    Satyadev : టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ ఒకరు. అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే హీరోగా కొనసాగుతున్నారు. సత్యదేవ్ భిన్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నప్పటికీ ఆయనకు బ్రేక్ రావడం లేదు. రావాల్సినంత గుర్తింపు దక్కడం లేదు. ఆచార్య, రామ్ సేతు, గాడ్ ఫాదర్ చిత్రాల్లో సత్యదేవ్ కీలక రోల్స్ చేశారు. హీరోగా ఆయన నటించిన గత రెండు చిత్రాలు గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ నిరాశపరిచాయి.

    కాగా ఈసారి ఆయన యాక్షన్ థ్రిల్లర్ ఎంచుకున్నారు. జీబ్రా టైటిల్ తో ఒక చిత్రం చేశాడు. ఈశ్వర్ కార్తీక్ ఈ మూవీ దర్శకుడు. కన్నడ నటుడు ధనుంజయ, సత్యరాజ్ కీలక రోల్స్ చేశారు. ప్రియా భవాని శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ నవంబర్ 22న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జీబ్రా ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ దర్శకుడితో పాటు జబర్దస్త్ షోకి వచ్చారు.

    సద్దాం, బుల్లెట్ భాస్కర్, రాకెట్ రాఘవ, నూకరాజు తమ స్కిట్స్ తో నవ్వులు పూయించారు. కాగా రామ్ ప్రసాద్ లోకల్ బ్యాంక్ ఆఫ్ తుక్కుగూడ పేరుతో ఒక స్కిట్ చేశాడు. శాంతి స్వరూప్ తో పాటు మరికొందరు జబర్దస్త్ కమెడియన్స్ ఈ స్కిట్ చేశారు. సత్యదేవ్ సైతం ఓ కామెడీ పాత్ర చేశాడు. ఈ క్రమంలో సత్యదేవ్ ని రామ్ ప్రసాద్ అవమానించాడు.సత్యదేవ్ కి వేసిన కుర్చీ తీసేయమన్నాడు. అయితే ఇది సీరియస్ మేటర్ కాదు. స్కిట్ లో భాగమే.

    సత్యదేవ్ కోటి రూపాయలు డిపాజిట్ చేస్తానని చెప్పడంతో బ్యాంకు మేనేజర్ గా ఉన్న రామ్ ప్రసాద్ కుర్చీ వేసి, కూల్ డ్రింక్ ఇచ్చి మర్యాదలు చేస్తాడు. ముందు ఈ వంద తీసుకుని అకౌంట్ ఓపెన్ చెయ్, సంపాదించాక కోటి రూపాయలు మీ బ్యాంకు లో వేస్తానని సత్యదేవ్ చెప్పడంతో.. రామ్ ప్రసాద్ కంగు తింటాడు. వేసిన కుర్చీ తీసేసి, కూల్ డ్రింక్ కూడా లాగేసుకోండి అంటాడు. అదన్నమాట మేటర్. దీనికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుంది.

    ఇక జీబ్రాతో అయిన హిట్ కొట్టాలని సత్యదేవ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి సపోర్ట్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి చూడాలి జీబ్రా సత్యదేవ్ కి ఎలాంటి అనుభవం ఇస్తుందో..