Vanisri: అవి ‘మహానటి సావిత్రి’ శకం ముగుస్తున్న రోజులు. మహానటి తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు అని సినీ ప్రముఖులు ఆందోళన పడుతున్న రోజులు. అప్పుడే స్టార్ గా ఎదిగింది వాణిశ్రీ. మరో సావిత్రి అవుతుంది అన్నారు. కానీ, సావిత్రి ప్రభావం తనమీద పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది వాణిశ్రీ. తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవరుచుకుంటూ ‘మహా కళాభినేత్రి వాణిశ్రీ అయింది’.
పల్లెటూరి పొగరుబోతు పాత్ర, మధ్యతరగతి అమాయిక యువతి పాత్ర వరకు ఆమె రూపం ఆ పాత్రలకు ప్రతిరూపం అయింది. వెండి తెర పై వెలుగు రేఖలా మెరిసిన కళాభినేత్రి వాణిశ్రీ. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన మొదటి రంగుల రాణి వాణిశ్రీ. చిన్న కవ్వింపుతోనే అనేక భావాలు పుట్టించగలిగే అందాల నటీమణి వాణిశ్రీ. అందుకే, సినీ జగతిలో ఆమె ప్రయాణం మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం,
Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్
వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. కళాభినేత్రిగా అభినయంలో తనకు సాటి మరొకరు లేరని, అశేష ప్రజల హృదయాల్లో అభినేత్రి గా నిలిచిపోయిన మరొక మహానటి. సుమారు పదిహేను ఏళ్ల పాటు సినీ రంగాన్ని రాణిలా ఏలింది. అయితే, ఎన్టీఆర్ గారితో ‘ఎదురు లేని మనిషి’ అనే సినిమా షూటింగ్ సమయంలో వాణిశ్రీ హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది.
ఆ రోజు ఉదయమే ఆమె షూటింగ్ కి వచ్చింది. ఆ రోజు సాంగ్ ను షూట్ చేస్తున్నాం అన్నారు. పైగా వాన పాట చిత్రీకరణ. అందుకే.. వాణిశ్రీ కాస్త ఇబ్బంది పడుతూనే ఆ రోజు షూట్ లో పాల్గొంది. కట్ చేస్తే.. ఆ పాట షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ పాటలోని ఒక స్టెప్ చాలా వల్గర్ గా ఉంది. దాంతో ఆ స్టెప్ చేయనని వాణిశ్రీ తెగేసి చెప్పింది. దర్శకనిర్మాతలు అంగీకరించలేదు. డబ్బు తీసుకునేటప్పుడే ఉండాలి ఇవన్నీ అని వాళ్ళు దెప్పిపొడిచారు.
వాణిశ్రీ మనసు గాయపడింది. నేరుగా ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పింది. ఎన్టీఆర్ గారు ఆమె మాటలు అన్నీ విని.. ‘చూడండి, వాణిశ్రీగారు ఆ స్టెప్ మీరే కాదు, నేను కూడా చేస్తున్నాను. నిర్మాత అప్పు తెచ్చి సినిమా చేస్తున్నాడు. మనం ఇలాంటి చిన్న చిన్నవి చూసి చూడనట్లు వెళ్లి పోతున్నట్లు ఉండాలి. అప్పుడే సినిమా పూర్తి అవుతుంది అని ఎన్టీఆర్ చెప్పారు.
అయితే, ఎన్టీఆర్ మాటలు వాణిశ్రీకి నచ్చలేదు. ఎన్టీఆర్ నచ్చ చెబుతున్నా ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. కానీ, మరుసటి రోజు ఆ స్టెప్ ఆమె వేసింది. అయితే ఆ తర్వాత ఆమె చిన్నగా సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. అంతలో ఆమె డాక్టర్ కరుణాకర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలుపెట్టి మంచి చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే బుల్లితెర పై ప్రేమనగర్ అంటూ టీవీ ప్రేక్షకులను కూడా అలరించింది.
Also Read: రానా ఇన్ని సూపర్ హిట్ మూవీలు వదులుకున్నాడా.. అవన్నీ చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడేమో..