spot_img
Homeఎంటర్టైన్మెంట్Senior Actress Sudha: ఆ నటి కన్నీళ్లు ప్రేక్షకులను కదిలించాయి !.

Senior Actress Sudha: ఆ నటి కన్నీళ్లు ప్రేక్షకులను కదిలించాయి !.

Senior Actress Sudha: సీనియర్ నటి సుధ అనగానే ఎన్నో వందలాది చిత్రాల్లో ఆమె చేసిన అత్త, అమ్మ, వదిన పాత్రలు గుర్తుకు వస్తాయి. ఏ పాత్రలో నటించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సహజ నటి సుధ గారు. నిజానికి ఆమె బాలనటిగా అప్పట్లో బాగా పేరు తెచ్చుకున్నారు. అలాగే పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్‌ గానూ కొన్ని సినిమాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత అత్తగా, అమ్మగా ఒదిగిపోయారు.

Senior Actress Sudha
Senior Actress Sudha

తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సుధ గారు.. పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు పడ్డారు. కాగా తాజాగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చింది. సుధా గారు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇన్నేళ్ల నా కెరీర్‌ లో చాలా సంపాదించాను. అలాగే కొన్ని బిజినెస్‌ లు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాను కూడా. ఢిల్లీలో నేను ఒక హోటల్‌ పెట్టాను. లాభం వచ్చింది.

Also Read: కంగనా రనౌత్ పోస్టులు సెన్సార్ చేయలేం – సుప్రీంకోర్టు
దాంతో మరో హోటల్‌ పెట్టాను. అన్నీ నష్టాలు వచ్చాయి. నిండా మునిగిపోయాను. అంతలో మా నాన్నగారు పోయారు. ఆయన పోయాక లైఫ్‌ అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. ప్రస్తుతం నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. నాకు మనుషుల్ని నమ్మకూడదని ఇప్పుడే అర్థమైంది. మా నాన్న గారికి క్యాన్సర్‌ అనగానే మా బంధువులంతా దూరం అయిపోయారు. నిజానికి నా భర్త, కొడుకులు కూడా నాకు దూరంగా ఎక్కడో యూఎస్‌లో ఉంటున్నారు.

కానీ వాళ్లకూ ఏదో ఒక రోజు నా పరిస్థితే వస్తుంది. నా భర్త, నా కొడుకు ఈ వీడియో చూస్తారు. అయినా వాళ్ళు నా గురించి ఆలోచించరు. బహుశా నా జీవితంలోని చేదును వాళ్ళు ఇష్టపడరు. అయినా, అమ్మ ప్రేమను అర్ధం చేసుకోలేని పిల్లలు ఉంటే ఎంత ? లేకపోతే ఎంత ? చాలామందికి తెలియక పోవచ్చు.. మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు నా నిజ జీవితంలో నిజంగా జరిగాయి’ అంటూ సుధ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను కదిలించింది.

Also Read: ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు ఎన్టీఆర్ ప్లాన్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper