https://oktelugu.com/

Vastu Tips: ఇంట్లో ఈ దిశలో డబ్బు ఉంచితే.. సంపద వృద్ధి చెందడం పక్కా!

ఇంట్లో కొందరు తెలియక ఏదో మూలన డబ్బు ఉంచుతారు. దీనివల్ల వారు ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంట్లో ఓ మూలన డబ్బు ఉంచడం వల్ల తప్పకుండా వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. మరి ఇంట్లో ఏ మూలన డబ్బు ఉంచాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2025 / 09:38 PM IST

    money

    Follow us on

    Vastu Tips: ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అంది, ఎలాంటి అప్పులు లేకుండా ఉండాలని అనుకుంటారు. ఇంట్లో డబ్బు వృద్ధి చెందడానికి హిందూ సంప్రదాయాలను పాటిస్తుంటారు. ప్రత్యేకమైన రోజుల్లో ఇంటికి కొన్ని వస్తువులు తీసుకొస్తే డబ్బు వస్తుందని కొందరు నమ్ముతారు. అలాగే ఇంట్లో కొన్ని పూజలు నిర్వహిస్తే డబ్బు పెరుగుతుందని లేకపోతే ఓ మూలన డబ్బు ఉంచడం వల్ల ఉన్న డబ్బు రెట్టింపు అవుతుందని కొందరు అనుకుంటారు. అయితే కొందరు ధనవంతులు ఒక్కసారిగా పేదరికంలోకి వెళ్లిపోతారు. మరికొందరు పేదవారు ఒక్కసారిగా ధనవంతులు అవుతుంటారు. చాలా తక్కువ సమయంలోనే ఇలా అవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని నియమాలను పాటించడం వల్లే వారెంట్లో డబ్బు వృద్ధి చెందిందని అంటుంటారు. ఇంట్లో కొందరు తెలియక ఏదో మూలన డబ్బు ఉంచుతారు. దీనివల్ల వారు ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంట్లో ఓ మూలన డబ్బు ఉంచడం వల్ల తప్పకుండా వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. మరి ఇంట్లో ఏ మూలన డబ్బు ఉంచాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    వాస్తు శాస్త్ర ప్ర‌కారం ఇంట్లో డబ్బును ఉత్తర నైరుతి దిశలో ఉంచాలని పండితులు అంటున్నారు. ఈ దిశలో డబ్బులు, బంగారం, విలువైన వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెడుతుంటారు. ఇలా పెట్టడం అంత మంచిది కాదని పండితులు అంటున్నారు. ఇంట్లో పడమర లేదా దక్షిణ దిశలో డబ్బు పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పొరపాటున కూడా ఈ మూలలో డబ్బును ఉంచవద్దు. అలాగే ఇంట్లో ఈశాన్య మూలను ఖాళీగా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు కుటుంబంలో ఉండవని నిపుణులు అంటున్నారు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిలవాలంటే శుభ్రం చేసుకోవాలి. ఉత్తర దిశను ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కేవలం తూర్పు వైపు మాత్రమే కిచెన్ ఉంచుకోవాలి. ఉత్తర దిశలో కిచెన్‌ను పెట్టడం వల్ల డబ్బు ఇంట్లో వృద్ధి చెందదు. ఇంట్లో తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

    ఎవరి ఇంట్లో అయిన లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం వారు శుభ్రత పాటించాలి. వేకువ జామునే లేచి ఇంట్లో దీపం పెట్టాలి. కొందరు పగలు 10 వరకు నిద్ర లేవకుండా ఉంటారు. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా శుభ్రత ఉండి, దీపంతో ఇళ్లు కలకలలాడుతుంటేనే ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. ఎవరి ఇంట్లో అయితే ఇల్లాలు అశుభ్రతగా ఉండి, ఇంటిని శుభ్రం చేసుకోకపోతే ఆర్థిక సమస్యల బారిన పడతారు. పూర్తిగా వారు కటిక పేదరికంలో ఉంటారు. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదని పండితులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.