Senior Actress Jayalalitha: పరిశ్రమ ఏదైనా ఆడవాళ్లకు రక్షణ లేదనేది నిజం. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో అమ్మాయిలంటే చులకన. కెరీర్లో ఎదిగే క్రమంలో అనేకమంది తోడేళ్లను దాటుకుంటూ వెళ్ళాలి. ఆఫర్ ఇస్తా పక్కలోకి వస్తావా అనే వాళ్ళు అడుగడుగునా తగులుతారు. కొందరు అమ్మాయిలను అయితే లైంగికంగా వాడుకుని ఆఫర్స్ కూడా ఇవ్వరు. మోసపోయామని తెలుసుకునే నాటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఒకప్పటి శృంగార తార, జయలలిత జీవితంలో అనేక చేదు అనుభవాలు ఉన్నాయట. దశాబ్దాల అనంతరం తనపై జరిగిన లైంగిక దాడిని ఆమె బయటపెట్టారు.
జయలలిత 80-90లలో వ్యాప్ రోల్స్ కి చాలా ఫేమస్. ఆమెకున్న గ్లామరస్ లుక్ ఓ తరహా పాత్రలకు పరిమితం చేసింది. శృంగార పాత్రలతో పాటు, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ ఆమె చేశారు. కాగా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తనను రేప్ చేశాడట. మొదటిసారి ఓ మలయాళ చిత్రానికి జయలలిత సైన్ చేశారట. సెట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ రేప్ సీన్ గురించి వివరించాలి… గది లోపలికి రమ్మన్నాడట. లోపలి వెళ్ళాక గడియవేసి లైంగిక దాడికి పాల్పడ్డాడట. ఈ విషయాన్ని నేను ఇంత వరకూ ఎక్కడా చెప్పలేదని ఆమె ఆవేదన చెందారు.
అయితే తనను రేప్ చేసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు నెలల్లోనే కన్నుమూసినట్లు జయలలిత వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి పేరు ఆమె బయటపెట్టలేదు. చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రంలో జయలలిత నటించాల్సిందట. వ్యాంప్ రోల్స్ చేస్తున్న కారణంగా తర్వాత రిజెక్ట్ చేశారట. అలాగే కే విశ్వనాథ్ బంధువుల అబ్బాయితో పెళ్ళి సంబంధం వచ్చి క్యాన్సిల్ అయినట్లు జయలలిత చెప్పుకొచ్చారు.
ఇక తన పేరు కూడా ఇబ్బందులకు గురి చేసిందని జయలలిత అన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు కూడా అదే. ఆమె పేరు కలిగిన జయలలిత వ్యాంప్ రోల్స్ చేయడాన్ని ఆమె అభిమానులు వ్యతిరేకించారట. పలుమార్లు ఇంటిపై దాడి చేశారని ఆమె వేదన చెందారు. ప్రస్తుతం ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. జీ తెలుగులో మన ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ లో జయలలిత ఉన్నారు.