Actors Anuja Reddy: తెలుగు చిత్ర సీమలో హీరో, హీరోయిన్లతో పాటు సైడ్ క్యారెక్టర్ గా నటించిన వారూ ఫేమస్ అయినవారున్నారు. కొందరు తక్కువ సినిమాలే చేసినా వారి యాక్టింగ్ తో అదరగొట్టి ఆకట్టుకున్నారు.ఇప్పుడున్న సినిమాల్లో కంటే 1980లల్లో వచ్చిన సినిమాల్లో నటించిన వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమకిచ్చిన పాత్రలో జీవించి న్యాయం చేశారు. అలా అందరిచేత మన్ననలను అందుకున్న నటి అనూజ రెడ్డి. ఈమె పేరు ఎవరికీ తెలియకపోవచ్చు… కానీ ఫొటోతో చూస్తే మాత్రం టక్కున గుర్తుపడుతారు. ఎక్కువగా బ్రహ్మానందంతో నటించిన ఈమె కొన్నాళ్లు సినిమాల్లో అలరించి ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?
అనూజ రెడ్డి గుంటూరుకు చెందిన అమ్మాయి. అనూజ చిన్నప్పుడే ఆమె కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఓ సినిమా కోసం అనూజ ఉండే ఏరియాకు షూటింగ్ బృందం వచ్చింది. అక్కడ ఈమెను చూసిన ఓ డైరెక్టర్ మలయాళ సినిమా కోసం సెలెక్ట్ చేశారు. ఈ సమయంలో అనూజకు 14 ఏళ్లు ఉండేవి. అయితే ఒక్కసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత తనకు సినిమాలపై ఆసక్తి పెరిగిందట.
అయితే మలయాళం, తమిళ సినిమాల్లో నటించిన అనూజను తెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఆమె సైడ్ పాత్రల్లోనే నటించారు. ఎక్కవగా బ్రహ్మనందం పక్కన నటించిన ఆమె తన వాయిస్, యాక్టింగ్ తో అదరగొట్టేది. చంటి సినిమాలో ఆమె నటనకు అన్ని వైపులా ప్రశంసలు దక్కాయి. ఇందులో ఆమె బ్రహ్మానందంతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఆ సమయంలో పలు సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నారు. కానీ మిగతా నటుల వలె స్టార్ గుర్తింపు రాలేదు.
దీంతో సినిమాలు మానుకొని అనూజ ఫ్యామిలీ లైఫ్ కే అంకితమైంది.ఆ తరువాత ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని కుమారుడికి జన్మనిచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. అలనాడు అలరించిన ఆమె ఇప్పుడు పూర్తిగా గుట్టుపట్టలేనంతగా మారిపోయింది. అప్పటి, ఇప్పటి ఫొటోలు చూస్తూ నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పాత గుర్తులన్నీ మీడియాతో పంచుకున్నారు.