Actor Brahmaji: టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు కమెడియన్ గా బ్రహ్మాజీ కి ఒక మంచి స్థానం ఉంది, రెండు దశాబ్దాల నుండి ఆయన ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా స్టార్ హీరోల సినిమాల దగ్గర నుండి, మీడియం రేంజ్ హీరోల సినిమాల వరకు ప్రతీ దాంట్లో బ్రహ్మాజీ ఉండాల్సిందే, ఆ రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్న నటుడు ఆయన.
ఆయన తనయుడు కూడా రీసెంట్ గానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. అతని పేరు సంజయ్ రావ్. తొలిసినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు, అయితే ఇప్పుడు రెండవ సినిమాగా ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ తో మన ముందుకు రాబోతున్నాడు. బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణవి మానుకొండ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది. మైక్ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రియా శిష్యుడు ఏఆర్ శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఈ నెల 21 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘ నా కొడుకు ఈరోజు హీరో అయ్యినందుకు చాలా ఆనందంగా ఉంది, ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం నన్ను కలిసాడు డైరెక్టర్, ఆ తర్వాత నా కొడుకుని హీరో గా తీసుకుంటా అన్నాడు, ఓకే అని చెప్పాను. తొలిసినిమా కి చిరంజీవి గారు, మహేష్ బాబు గారు మరియు ఎన్టీఆర్ గారు ప్రమోషన్స్ చేసారు. ప్రతీసారి వాళ్ళ సహాయం తీసుకుంటే బాగుండదు, మన సొంత కాళ్ళ మీద నిలబడాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం లో హీరో చెట్టుని పెళ్లి చేసుకొని, కుక్కతో శోభనం చేసుకుంటాడు. అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేదే కథ. సినిమా మొత్తం పూర్తిగా వినోదభరితంగా ఉంటూనే, ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అని డైరెక్టర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.