Homeఎంటర్టైన్మెంట్Seniga Chenla Nilabadi Chethuliyave: సోషల్ మీడియాను షేర్ చేస్తున్న మన ఫోక్ సాంగ్.. మీరు...

Seniga Chenla Nilabadi Chethuliyave: సోషల్ మీడియాను షేర్ చేస్తున్న మన ఫోక్ సాంగ్.. మీరు చూశారా..?

Seniga Chenla Nilabadi Chethuliyave: ఒకప్పుడు హిట్ సినిమా వస్తే దాని గురించి సంవత్సరాల తరబడి చర్చించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత మంచి సినిమా అయినా నెల తర్వాత థియేటర్ నుంచి వెళ్లిపోతుంది. అంతేకాకుండా చాలామంది డైరెక్టర్లు, హీరోలు రావడంతో వందల కొద్ది సినిమాలు వస్తున్నాయి. దీంతో ఏ సినిమా ప్రత్యేకమని అనిపించడం లేదు. ఇలాంటి సమయంలో యూటూబ్ ఫోక్ సాంగ్ తో ఉర్రూతలూగిస్తోంది. సినిమా లెవల్ లో కొన్ని సాంగ్స్ చిత్రీకరించి యూట్యూబ్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఇవి లక్షల్లో కాదు ఏకంగా మిలియన్లలో వ్యూస్ తెచ్చుకొని వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అలాంటి వాటిలో ఓ సాంగ్ ఏడాది నుంచి ఇప్పటివరకు 163 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్న ఈ సాంగ్ విశేషాలేవో ఇప్పుడు చూద్దాం..

ఇటీవల యూట్యూబ్లో జానపద గేయాలు ఒక్కొక్కటి పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో పడుకున్న పాటలకు డీజే సౌండ్స్ యాడ్ చేయడంతో అవి నేటి యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా సాంగ్స్ లలో డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉండడంతో వీక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా లెవల్లో ఈ సాంగ్స్ను చిత్రీకరిస్తున్నారు. అయితే ఏడాది కిందట అంటే 2025 సంవత్సరంలో శనగ చేల నిలబడి చేతులియ్యవే.. అనేసాంగ్ యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. జోగుల వెంకటేష్ ఈ పాటను పాడారు. దీనిని ఓ టీవీ ఛానల్ ద్వారా విడుదల చేశారు. దీనికి వెంకట్ అజ్మీరా సంగీతం అందించారు. అయితే ఈ పాటకు డీజే మిక్సింగ్ కలిపి మరోసారి విడుదల చేశారు. ఇందులో జాను లిరి తో పాటు రాజేష్ అనే ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.

ఇలా ఈ సాంగ్ ఏడాది నుంచి ఇప్పటివరకు 163 మిలియన్లను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఎన్నో ఫోక్స్ సాంగ్స్ యూట్యూబ్లోకి వచ్చాయి. కానీ ఇప్పటికీ దీని ట్రెండింగ్ కొనసాగడం విశేషం. ఒకవైపు జానపద సాంగ్ లా అనిపిస్తూనే మరోవైపు డాన్స్ చేయడానికి అనుకూలంగా ఉండడంతో కొంతమంది ప్రత్యేక ఫంక్షన్లలో దీనిని ప్లే చేస్తున్నారు. అంతేకాకుండా యూత్ సంబరాలు చేసుకునే సమయంలో కూడా దీనిని ప్లే చేస్తున్నారు. దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా దీనిని వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు ముందు ఈ సాంగ్స్ ఇంకా ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.

 

SENIGA CHENLA NILABADI CHETHULIYAVE DJ VERSION 2 || FULL SONG 4K || NEW DJ FOLK 2025 #JANULYRI

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version