Homeజాతీయ వార్తలుCaste Discrimination : ఆమె వంటకు కులాన్ని ఆపాదించారు.. బిజెపి ఎంపీ ఎంట్రీ తో సీన్...

Caste Discrimination : ఆమె వంటకు కులాన్ని ఆపాదించారు.. బిజెపి ఎంపీ ఎంట్రీ తో సీన్ మారింది.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Caste Discrimination : కులం కూడు పెట్టదు. మతం మనుగడ ఇవ్వదు. మానవత్వం మాత్రమే నిలిచి ఉంటుంది. అది ఎప్పటికీ మనిషితనాన్ని ఇష్టపడుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసరాగా ఉంటుంది. కన్నీళ్లు వచ్చినప్పుడు తుడుస్తుంది. మనిషికి అండగా నిలబడి.. ధైర్యాన్ని ఇస్తుంది.

వెనకటి కాలంలో అంటే కులం పట్టింపులు ఉండేవి. మనుషులు కులాలవారీగా విడిపోయి ఉండేవారు. ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే క్రమంలో ఒక కులం వారు మరొక కులం మీద దాడులు చేసుకునేవారు. ఇప్పుడు మనం సాంకేతిక కాలంలో ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని పనులు చేసుకుంటున్నాం. ఇంకా కొత్త కొత్త పరిజ్ఞానాలను కనిపెడుతున్నాం. ఇంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో కులాల ప్రస్తావన తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నిమ్న కులాల ప్రజలపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి. అయినప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు.

ఒడిశా రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రంలో దళిత యువతి వంటమనిషి పనిచేస్తోంది. అయితే ఆమెను వంట మనిషిగా నియమించడాన్ని కొంతమంది తప్పు పట్టారు. ఆమె వంట చేస్తే మా పిల్లలు తినరని స్పష్టం చేశారు. అంతేకాదు మూడు నెలలుగా ఆ అంగన్వాడి కేంద్రానికి తమ పిల్లలను పంపించడం మానేశారు. ఈ విషయం బిజెపి ఎంపీ బిజియంత్ పండా దృష్టికి వెళ్ళింది.

ఈ నేపథ్యంలో ఆయన మూడు నెలలుగా మూతపడిన అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. ఆ యువతికి మద్దతుగా రంగంలో దిగారు. ఆ యువతి ఇంటికి వెళ్లారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. అంతేకాదు ఇకపై ఆ అంగన్వాడి కేంద్రంలో ఆ దళిత యువతి వంట చేస్తుందని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న వారంతా తమ పిల్లలను ఆ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని సూచించారు..

బిజెపి ఎంపీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. ఎంపీ చూపించిన తెగువ చాలామందిలో కనువిప్పు కలిగించిందని.. ఇటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే సమాజంలో అశాంతికి ఆస్కారం ఉండదని.. కులాల కుంపట్లు అనేవి చోటు చేసుకోవని నెటిజన్లు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version