Sekhar Kammula: మన టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) పేరు కచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. హృదయానికి హత్తుకునే ఫీల్ గుడ్ మూవీస్ చేస్తూ శేఖర్ కమ్ముల యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సినిమాలో హీరో ఎవరు అనేది చూడరు, కేవలం శేఖర్ కమ్ముల అనే బ్రాండ్ ని చూసి గుడ్డిగా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తారు. అలాంటి ఇమేజ్ ఉన్న డైరెక్టర్ ఆయన. రీసెంట్ గానే ‘కుబేర’ చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే శేఖర్ కమ్ముల మొట్టమొదటిసారి తన శైలికి విభిన్నంగా లేడీ సూపర్ స్టార్ నయనతార తో ‘అనామిక’ అనే చిత్రం చేసాడు.
ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీరు తీసిన చిత్రాల్లో మీకు అసలు ఇష్టంలేని సినిమా ఏదైనా ఉందా అని అడగ్గా, శేఖర్ కమ్ముల నిమిషం కూడా ఆలోచించకుండా ‘అనామిక’ మూవీ పేరు చెప్తాడు. ఈ సినిమా ఎందుకో నాకు అసలు నచ్చలేదు, ఎక్కడో ఎదో తేడా జరిగింది, నయనతార లాంటి బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ తో చెయ్యాల్సిన సినిమా కాదిది. ఆమెతో ఆ చిత్రం అనవసరంగా చేసానే అని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల. ఈ చిత్రం ఆయనకు మొట్టమొదటి తమిళ సినిమా అనుకోవచ్చు. ఇదే చిత్రాన్ని తెలుగు లో కూడా దబ్ చేసి విడుదల చేశారు. రెస్పాన్స్ లో ఎలాంటి మార్పు లేదు. శేఖర్ కమ్ముల కెరీర్ లో ఉన్న ఏకైక ఫ్లాప్ చిత్రం ఇదే.
ఇకపోతే కుబేర తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శేఖర్ కమ్ముల, తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అక్కినేని నాగచైతన్య తో ఒక సినిమా చేస్తాడనే టాక్ ఉంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అదే విధంగా నేచురల్ స్టార్ నాని తో కూడా ఆయన సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యి చాలా కాలమే అయ్యింది. కానీ నాని కి ఉన్నటువంటి కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కనీసం ఈసారైనా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందో లేదో చూడాలి.