Punnami Naagu Heroine: ఒకప్పటి సినిమా ఇండస్ట్రీ స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో ఇండస్ట్రీలోకి వచ్చిన వారంతా చాలా సినిమాల్లో నటించారు. కొందరు సైడ్ పాత్రల్లో నటించినా మంచి గుర్తింపు తెచ్చుకునేవాళ్లు. ఇలాగే తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘పున్నమినాగు’ కనిపించారు. అయితే కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఇప్పుడు తన కొడుకుతో కలిసి సోషల్ మీడియాలో మెరిశారు. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఇప్పుడేం చేస్తుంది? ఆ వివరాల్లోకి వెళితే..
తమిళ సినీ ఇండస్ట్రీలో భారతీ రాజా గురించి దాదాపు అందరికీ తెలుసు. సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అయిన ఆయన ఆ కాలంలో ఎందరో హీరోలను, హీరోయిన్లను పరిచయం చేశారు. ఆయన తీసుకొచ్చిన చాలా మంది నటులు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాగే భారతీ రాజా చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చారు రతి అగ్నిహోత్రి. ముంబైకి చెందిన రతి ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆమె మొదటిసారిగా ‘పుదియ వర్ఫుకళ్’ సినిమాలో నటించారు. భాగ్యరాజా కు సైతం ఇది ఫస్ట్ మూవీనే.
ఈ సినిమా బంపర్ హిట్టు కొట్టడంతో రతికి తమిళ ఇండస్ట్రీ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వెంటనే ఆమె ‘నీరమ్ మారద పూక్కళ్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఇలా తమిళంతో పాటు హీందీ, ఊర్దూ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని కొట్టేసింది రతి అగ్నిహోత్రి. మెగాస్టార్ కెరీర్ లో మైలురాయిగా నిలించిన పున్నమి నాగు సినిమాలో రతి అగ్నిహోత్రిని చూడొచ్చు. ఇవే కాకుండా ప్రేమ సింహాసనం, భోగి మంటలు, కలియుగ రాముడు, డిక్టేటర్ వంటి సినిమాల్లో కనిపించింది.
చివరిగా ‘డిక్టేటర్’లో కనిపించిన రతి ఆ తరువాత వెండితెరపై కనిపించలేదు. 1985లోనే వ్యాపర వేత్త అనిల్ విర్వానీని వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల తన కుమారుడు తనూజ్ విర్వానీతో కలిసి కనిపించారు. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో వెలుగు వెలిగిన హీరోయిన్ ఇప్పుడు చాలా మారిపోయిందని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
View this post on Instagram