Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా “రాధేశ్యామ్”. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడికల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పిస్తున్నారు.

Also Read: స్నేహితులతో కలిసి రాధేశ్యామ్ సినిమా చూసిన ప్రభాస్.. ఆ సీన్ మాత్రం?
అయితే తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను విడుదల చేసింది చిత్ర బృందం. హిందీ వర్షెన్ లో సాగే… ఈ సాంగ్ ఆషికి ఆగయీ అనే లిరిక్స్ తో ప్రారంభం అవుతుంది. ఇక ఈ సాంగ్ లో ప్రభాస్, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు. లవ్, ఎమోషనల్ ఫీలింగ్ లతో ఇద్దరూ అలరించారు. ముఖ్యంగా ఈ సాంగ్ లో ప్రభాస్, పూజా మధ్య రొమాంటిక్ యాంగిల్ బాగా వర్కౌట్ అయింది. మూడు నిమిషాల 12 సెకండ్లు సాగే ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇవాళ సాయంత్రం ఈ సాంగ్ తెలుగు వర్షన్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Love like there's no tomorrow. Presenting the first from #MusicalOfAges #Radheshyam, #AashiquiAaGayi by @mithoon11 & @arijitsinghhttps://t.co/p7PBccMz8v
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/s31YRZa77V
— UV Creations (@UV_Creations) December 1, 2021
Also Read: అభిమాని ప్రేమకు మురిసిపోయిన ప్రభాస్.. ఖరీదైన గిఫ్ట్‌తో సర్ప్రైజ్!