Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ను మూవీ టీమ్ ప్రకటించింది.
ఈ సినిమాకు సంబంధించి దీపావళి కానుకగా రెండో సాంగ్ ” లాలా భీమ్లా ” అనే లిరికల్ సాంగ్ ను ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త పోస్టర్ ను కూడా మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారనే చెప్పాలి. అలాగే ఓ మందు బాటిల్ ను ముందు పెట్టుకుని…. లుంగీ గెటప్ లో పవన్ కళ్యాన్ అంతకు ముందు ఎన్నడూ చూడని గెటప్ లో అదరగొడుతున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
Let's celebrate this diwali with #TheSoundOfBheemla 🥁❤️🔥#LalaBheemla Video Promo out today at 07:02pm🔥#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/rOf6nqGQXG
— Sithara Entertainments (@SitharaEnts) November 3, 2021
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మీనన్ చేస్తుంది. అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తునడడం విశేషం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Second lyrical song update from bheemla nayak movie team
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com