Sebastian PC 524 OTT Release: సినిమా రిలీజై 15 రోజులు కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా ?

Sebastian PC 524 OTT Release: ఓటీటీ సంస్థలు అన్నీ నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. పైగా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాను కూడా చాలా తక్కువ సమయంలోనే ఓటీటీ సంస్థలు తమ ఫాలోవర్స్ కోసం అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన సెబాస్టియన్‌ పిసి 524 సినిమా కూడా చాలా త్వరగా ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం […]

Written By: Shiva, Updated On : March 12, 2022 6:01 pm
Follow us on

Sebastian PC 524 OTT Release: ఓటీటీ సంస్థలు అన్నీ నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. పైగా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాను కూడా చాలా తక్కువ సమయంలోనే ఓటీటీ సంస్థలు తమ ఫాలోవర్స్ కోసం అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన సెబాస్టియన్‌ పిసి 524 సినిమా కూడా చాలా త్వరగా ఓటీటీలోకి రాబోతుంది.

Sebastian PC 524 OTT Release

ఈ చిత్రం మార్చి 4న రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి రాబోతుంది. విడుదలై నెల రోజులైనా కాకముందే ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మార్చి 18 నుంచి ఆహాలో సెబాస్టియన్‌ పీసీ 524 స్ట్రీమింగ్‌ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రటకన వెలువడింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: షాకింగ్ : ప్రముఖ సినీ రచయిత మృతి

సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓటీటీలోకి తెచ్చేశారేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్‌ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది గానీ, సినిమాలో మేటర్ లేదు. అందుకే.. నిర్మాత సిద్ధారెడ్డి ఈ చిత్రాన్ని ఆహాకి అమ్మేసుకున్నారు.

రేచీకటి వల్ల సెబాస్టియన్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే పాయింట్ తో వచ్చిన ఈ సినిమా బాగానే సాగుతుంది. సినిమాలో మంచి ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది. ఏది ఏమైనా చాలా వేగంగా ఈ చిత్రం ఓటీటీల్లోకి రావడం నిజంగా విశేషమే. అసలు ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణంగా నిలిచింది కూడా ఓటీటీలే.

Sebastian PC 524 OTT Release

మరి ఇప్పటికే ఎన్నో ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఓటీటీలో సినిమాలను మనకు వీలు ఉన్నప్పుడు ప్రశాంతంగా యాడ్ బ్రేక్ లేకుండా నిరంతరాయంగా చూడవచ్చు. అందుకే.. సాధారణ ప్రేక్షకులు ఈ మధ్య థియేటర్స్ కి వచ్చి సినిమాని చూడటం మానేశారు. ఎక్కువగా ఓటీటీల్లోనే చూసేస్తున్నారు.

Also Read: బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్ !

Tags