Dil Raju : గత నాలుగు రోజుల హైదరాబాద్ లో ప్రముఖ సినీ నిర్మాతలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సకాలం లో టాక్సులు చెల్లించడం లేదని ఆరోపణలు రావడం తో ఈడీ అధికారులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో పాటు, పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్, అభిషేక్ అగర్వాల్ ఇలా ఎంతో మంది ప్రముఖులను విచారిస్తూ ఉన్నారు. నేటి తో ఈ విచారణ ముగిసినట్టు తెలుస్తుంది. నిర్మాత దిల్ రాజు తో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నినేని, రవి శంకర్ లంటూ ఈడీ ఆఫీస్ కి తీసుకెళ్లారు ఐటీ అధికారులు. దిల్ రాజు కి సంబంధించిన పలు కీలక ఆస్తులను ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల ద్వారా ఆయనకి వచ్చిన లాభాల్లో జీఎస్టీ ని చెల్లించలేదని, అందుకే అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ తర్వాత దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఎక్కువ శాతం ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చాలా వరకు ఘన విజయాలు సాధించాయి. #RRR , సలార్, కేజీఎఫ్ చాప్టర్ 2 , పుష్ప ఇలా ఎన్నో సినిమాలకు దిల్ రాజు నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి వందల కోట్ల రూపాయిలను ఆర్జించాడు. ఈ సంక్రాంతికి ఆయన నుండి ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు విడుదల అయ్యాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అవ్వగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. 10 రోజుల లోపే 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు.
ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయలకు పైగా లాభాలు రావొచ్చు. అయితే దిల్ రాజు కి డబ్బులు వచ్చినట్టే వచ్చి, చివరికి నష్టాలను మిగిలిస్తున్నాయి. ఆయనకి భారీ లాభాలు నాన్ థియేట్రికల్ రైట్స్ నుండే వస్తాయి. డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ అంటూ చాలానే ఉన్నాయి. ఈమధ్య కాలం లో వీటి వల్ల వచ్చే లాభాలు, థియేట్రికల్ బిజినెస్ ని దాటేస్తుంది. కాబట్టి నిర్మాతలు ఎక్కువ శాతం నష్టపోయేవి చాలా తక్కువ అని చెప్పొచ్చు. అందుకే వచ్చిన లాభాలకు తగ్గట్టుగా జీఎస్టీ లు చెల్లించకపోయినట్టు ఐటీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. ఇది దిల్ రాజు కి చాలా గట్టి షాక్ అనే చెప్పాలి. సంక్రాంతికి ఒక సినిమా పెద్ద సక్సెస్ అయ్యిందని ఆయన ముఖం మతాబులాగా వెలిగిపోతుండడం ఇన్ని రోజులు మనం చూసాము. కానీ ఇంతలోపే ఇలాంటి సమస్యల్లో చిక్కుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం.