https://oktelugu.com/

Film industry : వరుసగా 4వ రోజు సినీ ఇండస్ట్రీ పై ఐటీ అధికారుల సోదాలు..నేడు ఎవరెవరి పై చేస్తున్నారంటే!

గత నాలుగు రోజులుగా సినీ పరిశ్రమలోని బడా నిర్మాతలు, దర్శకులపై ఐటీ రైడింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఇంటి వద్ద ప్రారంభించి, పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్, అభిషేక్ అగర్వాల్ వంటి ప్రముహులపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 24, 2025 / 09:53 AM IST
    IT officials

    IT officials

    Follow us on

    Film industry : గత నాలుగు రోజులుగా సినీ పరిశ్రమలోని బడా నిర్మాతలు, దర్శకులపై ఐటీ రైడింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఇంటి వద్ద ప్రారంభించి, పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్, అభిషేక్ అగర్వాల్ వంటి ప్రముహులపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 నిర్మాతల లెక్కల్లో చాలా బొక్కలు ఉన్నాయని తేలింది. 531 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలకు సరిగా టాక్స్ కట్టలేదని అంటున్నారు. అదే విధంగా దిల్ రాజు ఇంట్లో గత నాలుగు రోజుల నుండి సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన సతీమణి ని బ్యాంక్ కి తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించి మరీ విచారణ చేపట్టిన ఘటన సంచలనం గా మారింది. సంక్రాంతికి విడుదలైన సినిమాలకు సంబంధించి నిర్మాతలు పోస్టర్స్ వేయడం వల్లే ఈ రచ్చ మొత్తం మొదలైందని అంటున్నారు. ఒక పక్క దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతుండగా, మరోపక్క ఆయన నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి.

    పోస్టర్స్ వల్లే ఇంత రచ్చ అవుతుందని ఇండస్ట్రీ లో ఒక వాదన వినిపిస్తుంటే, నిన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు దిల్ రాజు టీం ఒక పోస్టర్ ని విడుదల చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఇకపోతే నేడు, లేదా రేపు సినీ హీరోల పై కూడా ఐటీ దాడులు జరపబోతున్నట్టు తెలుస్తుంది. సినీ హీరోలు ఈమధ్య కాలం లో రెమ్యూనరేషన్ కి బదులుగా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు అందరూ ఈ ఫార్ములా ని అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చాలా పెరిగింది. డిజిటల్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్స్ కంటే, లాభాల్లో వాటాలే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు చాలా మంది.

    అందుకే వాటికి సంబంధించిన లెక్కలు పరిశీలించడానికి ఐటీ అధికారులు ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది . పుష్ప 2 చిత్రానికి డైరెక్టర్, హీరో లాభాల్లో వాటాలు పంచుకున్నారు. ఏ క్షణం లో అయినా ఐటీ అధికారులు అల్లు అర్జున్ ఇంట్లో సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కల్కి నిర్మాత అశ్విని దత్ పై కూడా త్వరలోనే సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయట. నేడు దిల్ రాజు తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్ళలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్క దిల్ రాజు కోసమే నాలుగు రోజుల సమయం వెచ్చించారంటే ఐటీ అధికారులు వీటిపై ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నిన్న దిల్ రాజు తల్లికి అనారోగ్యం అయితే ఐటీ అధికారులు తమ కార్లోనే హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇంత పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూడాలి.