https://oktelugu.com/

Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడంలో అసలు కారణం ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళ సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. నిజానికి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సైతం భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే...ఇక ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న ఆయన తన తదుపరి సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 24, 2025 / 09:57 AM IST
    Game Changer

    Game Changer

    Follow us on

    Game Changer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ లాంటి నటుడు మరొకరు ఉండరనేది వాస్తవం…మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్(Ram Charan) తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నవే కావడం వల్ల ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక వైవిధ్యమైన పాత్రలను ఎంచుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటు ముందుకు సాగాడు. ఇక రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో చేసిన మగధీర(Magadeera)మూవీ సూపర్ సక్సెస్ అయింది.అలాగే సుకుమార్(Sukumar) తో చేసిన రంగస్థలం (Rangasthalam) సినిమా నాన్ బాహుబలి(Bahubali) ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ (Game Changer) సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఆ రెమ్యూనరేషన్ ని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అందుకే మొదట రామ్ చరణ్ ఈ సినిమా కోసం 120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవాల్సింది. కానీ 60 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నాడు. ఇక ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో రామ్ చరణ్ 30 కోట్ల రూపాయలను కూడా తిరిగి వెనక్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమా ఫ్లాప్ పట్ల పూర్తి బాధ్యతను వహించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. శంకర్ లాంటి దర్శకుడిని నమ్మి రామ్ చరణ్ దిల్ రాజు భారీగా నష్టపోయారు. కాబట్టి దిల్ రాజును సేవ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చేసినట్టుగా తెలుస్తోంది.ఇక దిల్ రాజు బ్యానర్ లో మరొక సినిమా చేసుకోవడానికి రామ్ చరణ్ డేట్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

    మరి వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందనేది తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా శంకర్ లాంటి దర్శకుడు ఇలా ప్రతిసారి ప్రేక్షకులను నిరాశపరచడం అనేది సరైన విషయం కాదు అంటూ ఆయన అభిమానులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. కాబట్టి ఆ ఇమేజ్ ను సంపాదించుకోవాలంటే బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాతో భారీ సక్సెస్ కొట్టాల్సిన అవసరమైతే ఉంది…