https://oktelugu.com/

Saidharamtej : యాక్సిడెంట్ లో కాపాడిన వ్యక్తికి సాయిధరమ్ తేజ్ ఏం చేశాడంటే?

అయితే సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అనంతరం చాలా మీడియా, యూట్యూబ్ సంస్థలు ఆ ముస్లిం అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాయి. తనకు హీరో అని తెలియదని.. కాపాడానని.. చెప్పుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్ టీం తనకు సాయం చేస్తుందని చెప్పాడు.

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2023 / 06:51 PM IST
    Follow us on

    Saidharamtej : సాయిధరమ్ తేజ్.. ఈ మెగా హీరో గత సంవత్సరం దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు కోమాలోకి వెళ్లారు. చాలా సేపటి వరకూ ఆయనకు మెలకువ రాలేదు.

    అయితే సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురికాగానే ఒక యువకుడు అబ్దుల్ పర్హాన్ అతడి ప్రాణాలు కాపాడాడు. అంబులెన్స్ కు కాల్ చేసి సాయిధరమ్ తేజ్ ను ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే అదంతా కూడా ఆ   అబ్బాయి పెట్టిన భిక్షనే.

    అయితే సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అనంతరం చాలా మీడియా, యూట్యూబ్ సంస్థలు ఆ ముస్లిం అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాయి. తనకు హీరో అని తెలియదని.. కాపాడానని.. చెప్పుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్ టీం తనకు సాయం చేస్తుందని చెప్పాడు.

    తాజాగా సాయిధరమ్ తేజ్ కూడా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ఏం చేసినా తక్కువనే అని.. అతడి రుణం తీర్చుకోలేనిది అని.. అతడికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని నంబర్ ఇచ్చినట్టు సాయిధరమ్ తేజ్ తెలిపారు. అతడి అవసరాలన్నీ తన టీం నెవరేర్చుతోందని సాయిధరమ్ తెలిపారు.

    https://twitter.com/evvpunchlu333/status/1685846488260517888?s=20