Sayara Movie: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఏ భాషలో సినిమా వచ్చిన ప్రతి ప్రేక్షకుడు సినిమాని చూసి తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఇలాంటి సందర్భంలోనే ‘సైయారా’ అనే ఒక లవ్ స్టోరీ వచ్చి ప్రస్తుతం ప్రేక్షకులను మైమరపింపజేస్తుంది. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తుండటం తో ఈ మూవీ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది…అహన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ సినిమాకి ‘మోహిత్ సూరి’ (Mohith Suri) దర్శకత్వం వహించాడు.
అయితే ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమా సూపర్ గా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి ఫ్రీ పబ్లిసిటీ అయితే అయింది. మహేష్ బాబు ట్వీట్ చేసిన తర్వాత సుకుమార్ సైతం ఈ సినిమా మీద ప్రశంసలను కురిపిస్తూ ఒక ట్వీట్ అయితే వేశాడు. దాంతో ఈ సినిమాకు ఎక్కడ లేని ప్రమోషన్స్ అయితే లభించాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. 9 రోజుల్లో 200 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక సెన్సిబుల్ కథతో సినిమా వచ్చి సక్సెస్ ని సాధించింది అయితే లేదు. కాబట్టి సినిమా కి బాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలైతే దక్కుతున్నాయి…
Also Read: కాక రేపుతున్న అన్నాచెల్లెళ్ల వేర్వేరు మీటింగ్స్!
మరి ఇలాంటి సందర్భంలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నిదానంగా సక్సెస్ ల బాట పడుతుండడంతో అక్కడి ప్రేక్షకులను ఆనందానికి గురిచేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా రాబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
కనుక రాబోయే కొద్ది రోజుల్లో ఇలాంటి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తే మరోసారి వాళ్ళ సత్తా చాటుతారు అంటూ అక్కడి సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికైతే సైయారా(Saiyara) సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి సూపర్ సక్సెస్ గా ముందుకు దూసుకెళ్తుంది.
Also Read: స్టార్ హీరోల బాటలో కార్తీకదీపం డాక్టర్ బాబు…
ఇక ఈ మూవీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
తొమ్మిది రోజుల్లోనే 200 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను సాధిస్తోంది. తద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సినిమా ఎలా ప్లస్ అవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది…