Save The Tigers 2 Review: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్‌ 2 రివ్యూ

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'సేవ్ ది టైగర్ సీజన్ 2' సిరీస్ రిలీజ్ అయింది. మొత్తం 7 ఎపిసోడ్లు గా సాగే ఈ సిరీస్ ఎలా ఉంది, ప్రేక్షకుడిని ఆకట్టుకుందా? లేదా మొదటి సీజన్ తో పోలిస్తే ఇది భారీ సక్సెస్ అయిందా? అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : March 16, 2024 10:09 am

Save The Tigers 2 Review

Follow us on

Save The Tigers 2 Review: ప్రస్తుతం ఇండస్ట్రీ లో సెకండ్ పార్ట్ లకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అది సినిమాల వరకే కాకుండా సిరీస్ లకి కూడా మంచి గిరాకీ ఏర్పడింది. అందుకే ఇప్పుడు చాలా సిరీస్ లకు సెకండ్ సీజన్లు వస్తు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తున్నాయి. ఇక అందులో భాగంగానే గత సంవత్సరం సమ్మర్ కానుకగా వచ్చిన ‘సేవ్ ది టైగర్స్ ‘ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక దానికి సెకండ్ సీజన్ కూడా ఉంటుందని చెబుతూ మేకర్స్ మొదటి సీజన్ ను ఎండ్ చేశారు…ఇక అందులో భాగంగానే ఈరోజు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘సేవ్ ది టైగర్ సీజన్ 2’ సిరీస్ రిలీజ్ అయింది. మొత్తం 7 ఎపిసోడ్లు గా సాగే ఈ సిరీస్ ఎలా ఉంది, ప్రేక్షకుడిని ఆకట్టుకుందా? లేదా మొదటి సీజన్ తో పోలిస్తే ఇది భారీ సక్సెస్ అయిందా? అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ
మొదటి సీజన్ లో ఈ సిరీస్ ఎక్కడైతే ముగించారో ఇప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇక హీరోయిన్ అయిన హంసలేఖ ని కిడ్నాప్ చేశారు అనే ఆరోపణలతో పాల వ్యాపారి అయిన గంటా రవి (ప్రియ దర్శి), రచయిత అయిన రాహుల్ (అభినవ్ గోమట్టం), యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న విక్రమ్ (చైతన్య కృష్ణ) వీళ్ళు ముగ్గురు హీరోయిన్ ని కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేశారనే కేసు మీద పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇక దానితో వాళ్లకు సంబంధం లేదు అని తెలిసే లోపే న్యూస్ ఛానళ్లు వీళ్ళే హీరోయిన్ హంసలేఖ ని రేప్ చేసి మర్డర్ చేశారంటూ కథనాలు వెల్లడిస్తారు. ఇక దాంతో హంస లేఖ ఈ విషయాన్ని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చి వీళ్లకు కేసు కు ఏ సంబంధం లేదని చెప్పడం తో పోలీస్ స్టేషన్ నుంచి వీళ్లను బయటికి పంపిస్తారు…

ఇక వీళ్ల భార్యలు తమ భర్తలు మద్యం తాగి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు అని తెలుసుకొని సైకాలజిస్ట్ స్పందన ను కలిసి ఆమె సజెషన్స్ తీసుకుంటూ ఆమె చెప్పిన దాని ప్రకారమే వాళ్ల భర్తలతో నడుచుకుంటూ ఉంటారు. అయితే ఆమె ఇచ్చే సలహాలతో వాళ్ల కెరియర్లు ఎలా మలుపు తిరిగాయి.. రాహుల్, విక్రమ్ లు వాళ్ల గోల్స్ ను వాళ్ళు చేరుకున్నారా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సీరీస్ చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే మహి వి రాఘవ్ రాసుకున్న స్క్రిప్టు ప్రేక్షకులను చాలా బాగా ఎంగేజ్ చేసిందనే చెప్పాలి. మొదటి సీజన్ లో కామెడీతో నడిపించారు.ఇక ఈ సెకండ్ సీజన్ లో మాత్రం ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారు. ఇక ఎప్పటిలాగే ప్రియదర్శి, అభినవ్ గోమట్టం, చైతన్య కృష్ణ ముగ్గురు కూడా వాళ్ల పరిధి మేరకు చాలా బాగా నటిస్తూ కామెడీని పండిస్తూనే సిరీస్ ను చాలా బాగా ముందుకు నడిపించారు. ఒక కుటుంబంలో అనుమానం ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు జరుగుతాయి. అనే పాయింట్ ను బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ సేవ్ ద టైగర్స్ సెకండ్ సీజన్ లో ఒక కొత్త పాయింట్ తో దర్శకుడి మేకింగ్ కి ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక ప్రతి ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ ఉన్నప్పటికీ నాలుగో ఎపిసోడ్ లో కొంచెం కామెడీని డిఫరెంట్ వే లో చెప్పే ప్రయత్నం చేశారు.

కానీ అది అంత పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇక ఎపిసోడ్ వైజ్ గా చూడడం కంటే సీరియస్ మొత్తాన్ని ఒక్కసారిగా చూస్తే మాత్రం ఇది చాలా ఎంగేజింగ్ గా సాగుతుంది…ఇక టెక్నికల్ టీం కూడా చాలా బాగా వర్క్ చేసింది ముఖ్యంగా మ్యూజిక్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ ఈ సినిమాకి చాలా బాగా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఇందులో చేసిన ప్రతి ఒక్కరు వాళ్ల పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. రవి క్యారెక్టర్ లో ప్రియదర్శి చాలా ఈజ్ తో నటించి మెప్పించాడు. అలాగే రైటర్ అవ్వాలనుకున్న అభినవ్ గోమట్టం తన పాత్రలో ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా నటించాడనే చెప్పాలి. చైతన్య కృష్ణ కూడా చాలా సేటిల్డ్ గా నటించాడు. ఇక రోహిణి క్యారెక్టర్ అయితే ఈ సిరీస్ కి చాలా ప్లస్ అయింది. సుజాత, రేఖ, పావని లు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించడమే కాకుండా అవకాశం దొరికిన ప్రతిసారి తమ నటన ను ఉన్నత స్థాయిలో ప్రదర్శించి మంచి పేరు అయితే సంపాదించుకున్నారు… మొత్తానికైతే సేవ్ ది టైగర్స్ సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా వీళ్ళందరికీ చాలా మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి… సిరీస్ ను ముగించిన దాని ప్రకారం చూస్తే దీనికి సీజన్ 3 కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి సీజన్ 3 తో కూడా వచ్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…

ప్లస్ పాయింట్స్

కథ
రైటింగ్, డైరెక్షన్
లీడ్ ఆర్టిస్టులు

మైనస్ పాయింట్స్

కొన్ని ఎపిసోడ్స్ బోర్ గా అనిపించాయి..
క్లైమాక్స్ కొంచెం వీక్ గా అనిపించింది…

రేటింగ్
ఇక ఈ సిరీస్ కి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
సేవ్ ది టెగర్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది అందరూ చూడాల్సిన సిరీస్..