Balakrishna Wedding Card: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బాలయ్య బాబు చాలా తక్కువ సమయంలోనే నందమూరి నట వారసుడిగా ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా సూపర్ సక్సెస్ లను కూడా అందుకున్నాడు. ఇలాంటి బాలయ్య బాబు ఇప్పటికీ ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీపడి మరి నటిస్తున్నాడు. అలాగే ఎక్కడ తగ్గకుండా ఫైట్స్ కూడా చేస్తూ తనకు తానే పోటీ అనేలా తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఒకప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ గా లేదు కాబట్టి అప్పుడు వీళ్ళ పెళ్లి పత్రికకు సంబంధించిన న్యూస్ అనేది ఎక్కడ బయటికి రాలేదు కాకపోతే ఇప్పుడు ఆ పెళ్లి పత్రికకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో 1982 డిసెంబర్ 8వ తేదీన బాలయ్య బాబుకి వసుంధర దేవికి పెళ్లి అయినట్టుగా వెడ్డింగ్ కార్డులో ప్రింట్ అయింది. అంటే ఇప్పటికి వాళ్ల పెళ్లి అయి 41 సంవత్సరాలు అవుతుంది… ఇక మొత్తానికైతే బాలయ్య వాళ్ల నాన్న అయిన ఎన్టీఆర్ చెప్పిన మాటలని గుర్తు ఉంచుకొని, అప్పటినుంచి ఇప్పటివరకు స్టార్ హీరోగా కొనసాగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన చాలా వరకు సక్సెస్ లు సాధిస్తూ నందమూరి ఫ్యామిలీ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పటికీ కూడా యూత్ లో గాని, నందమూరి అభిమానుల్లో గాని మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక ఆయన సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య బాబు బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…