Homeఎంటర్టైన్మెంట్Satyam Sundaram Teaser: సత్యం సుందరం టీజర్ రివ్యూ: కార్తీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు,...

Satyam Sundaram Teaser: సత్యం సుందరం టీజర్ రివ్యూ: కార్తీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు, పాపం అరవింద స్వామి బుక్ అయ్యాడు!

Satyam Sundaram Teaser: ప్రయోగాలకు హీరో కార్తీ పెట్టింది పేరు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా అన్ని రకాల జోనర్స్ ట్రై చేస్తారు. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ తో పాటు పలు చిత్రాలు తెలుగులో కూడా ఆదరణ దక్కించుకున్నాయి. టాలీవుడ్ లో మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోలలో కార్తీ కూడా ఒకరు. ఆయన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. 96 మూవీ ఫేమ్ సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. సత్యం సుందరం మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. సత్యం సుందరం టీజర్ విడుదలైంది.

కార్తీ గతంలో ఎన్నడూ చేయని అమాయకుడైన పల్లెటూరి కుర్రాడి పాత్ర చేశాడు. ఇక పట్నం నుండి పెళ్లికి హాజరయ్యేందుకు సొంతూరు వచ్చిన వ్యక్తిగా అరవింద స్వామి పాత్ర ఉంది. టీజర్ పరిశీలిస్తే… సత్యం సుందరం మూవీ ఈ రెండు పాత్రల మధ్య సాగే కామెడీ డ్రామా అనిపిస్తుంది. టైటిల్ సైతం అదే తెలియజేస్తుంది. వీరిద్దరిలో ఒకరు సత్యం మరొకరు సుందరం. పట్నంలో ఉంటున్న ఒకప్పటి పల్లెటూరి వ్యక్తిగా అరవింద స్వామి పాత్ర ఉంది. ఇక పల్లెటూరు వాతావరణంలో సంతోషంగా బ్రతికేసే ఇన్నోసెంట్ ఫెలో గా కార్తీ ఉన్నాడు.

కార్తీ, అరవింద స్వామి ఫ్రెండ్స్. చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తూ అరవింద స్వామిని ఇరిటేషన్ కి కార్తీ గురి చేస్తున్నాడు. టీజర్ లో ఉన్న కొన్ని సన్నివేశాలు ఆసక్తి రేపాయి. ముఖ్యంగా కార్తీ ఇన్నోసెంట్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ మెప్పించాయి. మొత్తంగా సత్యం సుందరం టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మాస్ హీరో ఇమేజ్ ఉన్న కార్తీ ఈ తరహా పాత్ర చేయడం సాహసమే అని చెప్పాలి.

సత్యం సుందరం చిత్రాన్ని 2 D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. శ్రీదివ్య హీరోయిన్ గా నటిస్తుంది. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సీ. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన 96 అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన నుండి వస్తున్న సత్యం సుందరం ఎలా ఉంటుందో చూడాలి…

 

Sathyam Sundaram - Teaser | Karthi | Arvind Swami | Govind Vasantha | C.Premkumar | Suriya | Jyotika

Exit mobile version