మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా “లూసిఫర్” రీమేక్. అందుకే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ అనుచరుడి పాత్రలో యంగ్ హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సత్యదేవ్ నటిస్తోంది అనుచరుడి పాత్ర కాదట, మెగాస్టార్ కి విలన్ గా సత్యదేవ్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
“లూసిఫర్” రీమేక్ లో పృధ్వీరాజ్, వివేక్ ఓబరాయ్ పాత్రలు చాలా కీలకం. ఈ పాత్రల్లో విలన్ వివేక్ ఓబరాయ్ పాత్రలో సత్యదేవ్ ను తీసుకున్నారు. ఇది పర్ఫెక్ట్ విలన్ పాత్ర, ఈ విలన్ పాత్రకు విలక్షణ నటుడు సత్యదేవ్ ఎంపిక కావడం సినిమాకి ప్లస్ కానుంది. మరి మెగాస్టార్ అనుచరుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
ఒకరకంగా సెకెండ్ హీరో రేంజ్ క్యారెక్టర్ లాంటిది అనుచరుడి పాత్ర. మొదట ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని అన్నారు. కాకపోతే తక్కువ నిడివి గల ఆ పాత్రలో బన్నీని తీసుకుంటే.. బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని.. ఆ పాత్రలో మరో హీరో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్స్ వచ్చాయి. విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి..
సినిమాకి కూడా బాగా ప్లస్ అవుతుంది. మరి చూడాలి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నిజంగానే నటిస్తాడో లేదో అనేది. అలాగే మంజు వార్యర్ పాత్ర కూడా చాలా కీలకమైనది కాబట్టి.. ఆ పాత్ర కోసం సుహాసిని తీసుకున్నారు. అన్నట్టు తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసిన సంగతి తెలిసిందే.