Viral Video: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో SSMB29 రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయినట్లు కూడా తెలుస్తోంది. మూవీ టీం స్పెషల్‌గా ప్రకటించకపోయినా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే మిగతా దర్శకులతో పోలిస్తే రాజమౌళి (rajamouli) సినిమా అంటే ఒక రెండు నుంచి మూడేళ్లు సమయం వదిలేయాలి. మధ్యలో ఏ సినిమాకి కూడా కమిట్‌మెంట్ ఇవ్వకూడదు. అసలు ఎలాంటి పర్సనల్ పనులు కూడా పెట్టుకోకూడదు. కానీ మహేశ్ బాబు అలా కాదు.. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక ఫారిన్ ట్రిప్‌కు వెళ్తుంటారు. కుటుంబంతో సరదాగా గడపడానికి ఎక్కువగా సూపర్ స్టార్ ప్రయత్నిస్తుంటాడు. అయితే జక్కన్న సినిమా అంటే ఏళ్లు సమయం పట్టడంతో పాటు మన సమయాన్ని కూడా పెట్టాలి. మహేశ్ బాబు ఫారిన్ టూర్ ఎక్కడికి వెళ్లకుండా తనని లాక్ చేసినట్లు జక్కన్న ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. పాస్ పోర్టు చూపిస్తూ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. మహేశ్ బాబు ఇంకా ఎక్కడికి ట్రిప్‌లకు వెళ్లరని, షూటింగ్ ప్రారంభమవుతుందని అందరూ ఊహించారు. అయితే రాజమౌళి మహేశ్ పాస్ పోర్టు తీసుకోవడంతో.. సోషల్ మీడియాలో తాజాగా ఒక సెటైరికల్ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూద్దాం.
మహేశ్ బాబు పాస్ పోర్టు తీసుకుంటే.. కుటుంబాన్ని చూడాలని ఫీల్ అవుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమ్రత చూడాలి.. నిన్ను సితారాను చూడాలి.. గౌతమ్‌తో గేమ్స్ ఆడాలి.. హాలిడేస్‌కి హవాయ్ పోవాలనే ఒక సెటైరికల్ వీడియో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోకి విజ్యూవల్స్ కూడా సూపర్‌గా సెట్ చేశారు. ఏడుస్తున్న పిల్లగాడు ఒక ఏడారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన దానికి ఈ లిరిక్స్‌ను సెట్ చేశారు. ఈ SSMB29 సినిమా ఇప్పట్లో పూర్తి కాదని, దాదాపుగా నాలుగేళ్లు అవుతుందని, పోని పారిపోదామంటే.. పాస్ పోర్టు తీసుకున్నారని, సెటైరికల్‌గా రాశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. బాగా సెట్ చేశారని అంటున్నారు. సరిగ్గా వీడియో విజ్యూవల్స్‌కి, లిరిక్స్, రాజమౌళి సినిమా కమిట్‌మెంట్‌కి బాగా సెట్ అయ్యిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ సెటైరికల్ వీడియో లిరిక్స్ చాలా క్రియేటివిటీగా రాశారని అంటున్నారు. అసలు ఈ వీడియో నమత్ర, మహేశ్ బాబు, జక్కన్న చూస్తే ఎలా ఉంటుందని అంటున్నారు. లిరిక్స్ చాలా ఫన్నీగా ఉన్నాయని.. వీడియో చూసి నవ్వి నవ్వి చచ్చిపోతే బాధ్యత ఎవరిదని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram