https://oktelugu.com/

మహేష్ లేకుండానే ‘సర్కారువారిపాట’.. వర్కౌట్ అయ్యేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. పర్శురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ‘సర్కారువారిపాట’ మూవీని నిర్మిస్తోంది. మహేష్ బాబు సైతం సహా ప్రొడ్యుసర్ గా ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినిమా మహేష్ బాబుతో కూడిన ఫస్టు లుక్కును చిత్రబృందం విడుదల చేసింది. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. Also Read ‘ఆచార్య’ చిరంజీవి మౌనం.. కొరటాలకు శాపంగా మారనుందా? […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 05:00 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. పర్శురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ‘సర్కారువారిపాట’ మూవీని నిర్మిస్తోంది. మహేష్ బాబు సైతం సహా ప్రొడ్యుసర్ గా ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినిమా మహేష్ బాబుతో కూడిన ఫస్టు లుక్కును చిత్రబృందం విడుదల చేసింది. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది.

    Also Read ‘ఆచార్య’ చిరంజీవి మౌనం.. కొరటాలకు శాపంగా మారనుందా?

    కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇటీవలే టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైంది. ఇక ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలంతా షూటింగుల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సర్కారువారిపాట’ సినిమాను ప్రారంభించేందుకు చిత్ర నిర్మాతలు సన్నహాలు చేపట్టారు. ఈ మూవీ షూటింగు అమెరికాలో 45రోజులపాటు ఏకదాటిగా చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది.

    నటీనటుల వీసాల విషయంలో సమస్యలు రావడంతో అమెరికాలో షూటింగ్ ను చిత్రయూనిట్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు సినిమా కోసం ఇచ్చిన డేట్స్ మొత్తం చిత్రబృందం క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు విన్పించాయి. దీంతో ‘సర్కారువారిపాట’ నిర్మాతలు అలర్ట్ అయ్యారు.

    ఈ సినిమా నుంచి మహేష్ బాబు తప్పుకుంటాడనే ప్రచారం జరుగుతుండటంతో నిర్మాతలు ప్లాన్ బీతో ముందుకెళుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా తగ్గుముఖం పట్టడంతో తొలి షెడ్యూల్ ఇక్కడే చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది. మహేష్ బాబు షూటింగులో పాల్గొన్నా.. పాల్గొనకపోయినా కొంత సినిమాను తెరకెక్కించాలని భావిస్తోంది. షూటింగు కొంతమేర జరిగితే సినిమా ఆగిపోయిందనే వదంతులు నిలిచిపోతాయని నిర్మాతలు భావిస్తున్నారు.

    Also Read: మోనాల్ ఏమి చేస్తోందో ఆమెకైనా తెలుసా ?

    మహేష్ బాబును ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ ఇండియాలోనే ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సన్నివేశాలు మినహా మిగతా నటీనటుల సన్నివేశాలను శరవేగంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మహేష్ ఇప్పట్లో ‘సర్కారువారిపాట’ షూటింగ్ వద్దంటే అప్పుడు వాయిదా వేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. దీంతో త్వరలోనే ‘సర్కారువారిపాట’ పట్టాలెక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది