https://oktelugu.com/

‘ఆచార్య’ చిరంజీవి మౌనం.. కొరటాలకు శాపంగా మారనుందా?

దేశంలో క్రమంగా కరోనా తగ్గముఖంగా పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మరో మూడునెలల్లో భారత్ లో కరోనా కేసులు జీరోస్థాయికి చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు కొద్దిరోజుల కిందటే అనుమతి ఇచ్చాయి. దీంతో టాలీవుడ్లో సినిమా సందడి మొదలైంది. Also Read: మోనాల్ ఏమి చేస్తోందో ఆమెకైనా తెలుసా ? కరోనా సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్లోని ప్రముఖులు తెలుగు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 04:56 PM IST
    Follow us on

    దేశంలో క్రమంగా కరోనా తగ్గముఖంగా పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మరో మూడునెలల్లో భారత్ లో కరోనా కేసులు జీరోస్థాయికి చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు కొద్దిరోజుల కిందటే అనుమతి ఇచ్చాయి. దీంతో టాలీవుడ్లో సినిమా సందడి మొదలైంది.

    Also Read: మోనాల్ ఏమి చేస్తోందో ఆమెకైనా తెలుసా ?

    కరోనా సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్లోని ప్రముఖులు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిశారు. షూటింగులకు పర్మిషన్ ఇవ్వాలని కోరగా ఇరువురు సీఎంలు సానుకూలంగా స్పందించి అనుమతి ఇచ్చారు.కరోనా నిబంధనలు పాటిస్తూ టీవీ, సినిమాల షూటింగులు చేసుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.  దీంతో టీవీ షూటింగులు ప్రారంభమైన సినిమాలు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.

    హైదరాబాద్లో కరోనా ఉధృతి తగ్గకపోవడంతో టాప్ హీరోలంతా సినిమాలు చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో మెగాస్టార్  చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలువాలని భావించారు. అయితే ఆయన వయస్సు 60పైబడి ఉండటంతో చిత్రబృందం ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ సినిమా ప్రారంభంపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి.

    ఆచార్య మూవీలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీలో రాంచరణ్ స్పెషల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 30శాతం మేర పూర్తయింది. మెగాస్టార్ పై లెంగ్తీ షెడ్యూల్.. రాంచరణ్ పై 30రోజుల షెడ్యూల్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో బీజీగా ఉన్నాడు. తాజాగా కాజల్ అగర్వాల్ పెళ్లి కూడా ఫిక్స్ అయింది.

    Also Read: బిగ్‌బాస్‌ ఓటింగ్‌పై అనుమానాలు.? సంచలన ఆరోపణ!

    దీంతో ఇప్పట్లో మూవీ షూటింగు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిరు ‘ఆచార్య’పై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో మెగాస్టార్ మౌనం దర్శకుడు కొరటాల శివకు శాపంగా మారుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా మెగాస్టార్ ‘ఆచార్య’పై మౌనం వీడుతారో లేదో వేచిచూడాల్సిందే..!