Sarkaru Vaari Paata: కూల్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ఇష్టపడి చేస్తోన్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రెడీ అయిందని, అయితే దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట.

తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, కాబట్టి పాటల పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ కి వస్తే.. రేపటి నుంచి ఈ సినిమా కామెడీ ట్రాక్ ను షూట్ చేయబోతున్నారు. ఈ ట్రాక్ లో మహేష్ తో పాటు వెన్నల కిషోర్, బ్రహ్మాజీ కీలక నటులు.
అందుకే వారి కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను రేపటి నుంచి షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత, మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాంగ్స్ ను షూట్ చేస్తారు. అయితే, ఈ సినిమా రిలీజ్ పై డౌట్ ఉంది. ముందుగా చెప్పిన ప్రకారమే ‘సంక్రాంతి’ కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీనే రిలీజ్ చేస్తారా ? లేక, డేట్ మారుస్తారా అనేది చూడాలి.
ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది. సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.
ఇక ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది. తన తండ్రిని మోసం చేసి, వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి తిరిగి ఆ డబ్బును మహేష్ బాబు ఎలా రాబట్టాడనే కోణంలో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్లేతో సాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.