https://oktelugu.com/

మహేష్ బాబు బర్త్ డే బ్లాక్ బస్టర్ నోటీస్ ఇదీ

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకుడు పరుశురాం మొదటి నోటీసు ఇచ్చారు. మహేష్ బర్త్ డే సందర్భంగా మూవీలో ఆయన ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. స్టైలిష్ గా ఉన్న దెబ్బతిన్న కారులోంచి పోరాటం చేసిన మహేష్ బాబు దిగుతున్న స్టైలిష్ ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మహేష్ బాబు బర్త్ డే ఆగస్గు 9. ఈరోజును పురస్కరించుకొని ముందుగా మహేష్ అభిమానుల కోసం ‘సర్కారివారి పాట’ మూవీ టీం ఈ ఫొటోను […]

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2021 / 04:45 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకుడు పరుశురాం మొదటి నోటీసు ఇచ్చారు. మహేష్ బర్త్ డే సందర్భంగా మూవీలో ఆయన ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. స్టైలిష్ గా ఉన్న దెబ్బతిన్న కారులోంచి పోరాటం చేసిన మహేష్ బాబు దిగుతున్న స్టైలిష్ ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

    మహేష్ బాబు బర్త్ డే ఆగస్గు 9. ఈరోజును పురస్కరించుకొని ముందుగా మహేష్ అభిమానుల కోసం ‘సర్కారివారి పాట’ మూవీ టీం ఈ ఫొటోను విడుదల చేసింది. మహేష్ బాబు కు బర్త్ డే బ్లాస్టర్ ఆగస్టు 9న అంటూ ఫొటోపై రాసుకొచ్చింది.

    ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. జనవరి 13న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ప్రభాస్ రాదేశ్యామ్, పవన్ ‘అయ్యప్పమ్ కోషియమ్’కు పోటీగా మహేష్ బాబు సైతం సంక్రాంతి బరిలో దిగడం విశేషంగా చెప్పొచ్చు.

    మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారివారి పాట’ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్.. 14 రీల్స్ ఎంటెర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు