https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి అతి చేరువలో!

రీసెంట్ గా విడుదలైన 'సరిపోదా శనివారం' చిత్రంతో మరోసారి రుజువు అయ్యింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 5, 2024 / 10:49 AM IST
    Saripodhaa Sanivaaram

    Saripodhaa Sanivaaram

    Follow us on

    Saripodhaa Sanivaaram: ప్రతి సినిమాతో తనని తాను మార్చుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఆయన నటించిన ప్రతి సినిమా ప్రత్యేకంగానే ఉంటుంది. మొదటి సినిమా నుండి వైవిద్యం కోరుకుంటూ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ వస్తున్న నాని , ‘దసరా’ చిత్రం తో తన మార్కెట్ పరిధిని బాగా పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత నాని కి A సెంటర్స్ లో స్టార్ హీరో రేంజ్ స్థాయి దక్కింది. ఓవర్సీస్ లో అయితే ఈయన సినిమాలకు వస్తున్న వసూళ్ళు కొంతమంది స్టార్ హీరోలకు కూడా రావడం లేదని రీసెంట్ గా విడుదలైన ‘సరిపోదా శనివారం’ చిత్రంతో మరోసారి రుజువు అయ్యింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది.

    ఓపెనింగ్స్ కూడా అందుకు తగ్గట్టుగానే వచ్చాయి. అయితే ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి చూస్తారో లేదో, పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన వర్షాలు పడుతున్నాయి అనే అనుమానాలు ట్రేడ్ పండితుల్లో మొదటి రోజు ఉండేవి. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా అద్భుతమైన లాంగ్ రన్ ని బాక్స్ ఆఫీస్ వద్ద సొంతం చేసుకుంది. విడుదలై నేటితో వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి ఈ కథనం లో చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 10 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, రాయలసీమ ప్రాంతంలో 3 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది.

    అలాగే ఉత్తరాంధ్ర లో రెండు కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా , తూర్పు గోదావరి జిల్లాలో కోటి 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి రూపాయిలు, గుంటూరు జిల్లాలో కోటి 35 లక్షలు, నెల్లూరు జిల్లాలో 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే ఓవర్సీస్ లో 11 కోట్లు, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్ల 65 లక్షలు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల రూపాయిల షేర్ కి దగ్గరగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 42 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కి ప్రస్తుతం మూడు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే అవసరం ఉంది అన్నమాట. ఈ వారంలోనే ఆ మార్కుని విజయవంతంగా దాటుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.