Sarangapani Jathakam Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు చేసే సినిమాలకు మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక అలాంటి వాళ్ళలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమాలో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. ఆయన సినిమాలని చూడడానికి జనాలు ఇష్టపడుతూ ఉంటారు. రొటీన్ రెగ్యూలర్ కథలను కాకుండా ఒక డిఫరెంట్ కథలను ఎంచుకొని ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రియదర్శి ని హీరోగా పెట్టి చేసిన ‘సారంగపాణి’ అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read : కీరవాణి ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న హిందువులు..కారణం ఏమిటంటే!
కథ
సారంగపాణి అనే వ్యక్తి కార్ షోరూమ్ లో సేల్స్ మేన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇక తను మైథిలి అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు మైథిలి తనంతట తానే వచ్చి సారంగపాణి కి ఐ లవ్ యు చెబుతుంది. దాంతో ఆయన ఆనందానికి అవధులు ఉండవు. ఇక ఇద్దరు ప్రేమించుకున్న కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఇక ఈ క్రమంలోనే సారంగపాణి కి జాతకాల పిచ్చి ఉండడంతో వాళ్ళిద్దరి జాతకాలు చూపిస్తాడు.
అయితే వీళ్ళిద్దరికీ సెట్ అవ్వదని ఒకవేళ సారంగపాణి మైథిలి ని పెళ్లి చేసుకుంటే తను ఒక హత్య కేసులో జైలుకు కూడా వెళ్తాడంటూ అతని జాతకంలో ఉందని తన జాతకం చూసిన జ్యోతిష్యుడు చెప్పడంతో ఈ పెళ్లి క్యాన్సల్ చేయాల్సి వస్తుంది. మరి తను మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? తనకు నిజంగానే ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయా? వాటి ద్వారా తనను తాను ఎలా సేవ్ చేసుకున్నాడు. అనే విషయాలు తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సారంగపాణి పాత్రలో ప్రియదర్శి చాలా అద్భుతంగా నటించాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ రాసుకున్న కథ గాని ఆయన స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కానీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత సరదాగా సాగిపోయే ఒక సినిమా చూశామనే ఫీల్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అందుకే ఇంద్రగంటి మోహనకృష్ణ టేకింగ్ తో ఈ సినిమాని మరోసారి సూపర్ సక్సెస్ గా నిలిపే ప్రయత్నం అయితే చేశారు.
కథ పాతగా అనిపించినప్పటికి కథనంతో దానికి కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు…అలాగే ఈ సినిమాలోని కొన్ని కోర్ ఎమోషన్స్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అందువల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలిచిందనే చెప్పాలి. మరి ప్రస్తుతం ఈయన సినిమాలన్నీ ఓకె టెంప్లేట్ లో సాగుతూ ఉంటాయి.
అవి ఏ సెంటర్లో ఉన్న ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి అనే ఒక పేరైతే ఉంది. మరి దాన్ని చెడగొట్టుకోకుండా ఆయన చాలావరకు చాలా సింపుల్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు…ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా వివేక్ సాగర్ చాలా మంచి మ్యూజిక్ అయితే అందించాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శి చాలా అద్భుతంగా నటించాడు. ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలన్నింటిని చూసినట్టయితే ప్రతి సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ లో కనిపిస్తూ ఆ సినిమాని విజయ తీరాలకు చేర్చడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అవుతున్నాడు. రోజు రోజుకి తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. ఇటు హీరోగా, అటు కమెడియన్ గా కూడా చాలా సినిమాల్లో నటిస్తూ తనకు ఎవరు పోటీ లేరు అనే అంతలా గుర్తింపైతే సంపాదించుకుంటున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పించింది అంటే దానికి ప్రియదర్శి చేసిన పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి…
ఇక హీరోయిన్ గా చేసిన రూప కూడా చాలా చక్కటి పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది… వెన్నెల కిషోర్, వైవా హర్ష లాంటి కమెడియన్స్ కొంతవరకు కామెడీని పండించే ప్రయత్నం అయితే చేశారు. కొంతవరకు కామెడీతో మెప్పించే ప్రయత్నం చేసినప్పటికి వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు న్యాయం చేశారు. ఇక మిగతా పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ చాలా మంచి మ్యూజిక్ ని అందించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా మీద హైప్ ని పెంచే ప్రయత్నం చేశాడు.
పీజీ విందా అందించిన విజువల్స్ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇప్పటివరకు ఇంద్రగంటి మోహనకృష్ణ చేసిన ఏ సినిమా కూడా ఇంత బ్రైట్ గా అయితే కనిపించదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా నీట్ గా కనిపిస్తూ వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది… ఎడిటర్ సైతం ఈ సినిమాలోని అనవసరపు సీన్లు ఏమీ లేకుండా తన కత్తెరకు పని చెప్పి సినిమా లెంత్ తగ్గించే ప్రయత్నం చేశాడు…
ప్లస్ పాయింట్స్
ప్రియదర్శి
కామెడీ సీన్స్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
కొన్ని అనవసరపు సీన్స్…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5