Sandeep Reddy Vanga and Vijay Devarakonda : అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga)… అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోవడమే కాకుండా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పెను ప్రభంజనాలను సృష్టించాడు. ఇక బాలీవుడ్ లో కబీర్ సింగ్, అనిమల్ రెండు సినిమాలతో బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేశాడు. తెలుగు నుంచి అక్కడికి వెళ్లి ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకుడిగా తనకంటూ ఒక మంచి ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డివంగ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ను ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చాడు. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకోవడంలో ఆయన కీలకపాత్ర వహిస్తూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే మొదటి కాంబినేషన్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడప్పుడే సినిమా వచ్చే అవకాశామైతే లేదు అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇలాంటి నేపధ్యం లో విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు కూడా మంచి కథ కుదిరితే మరోసారి వాళ్లు సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే సందీప్ రెడ్డివంగా ఇప్పుడు వెయ్యికోట్ల డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక విజయ్ దేవరకొండ మార్కెట్ ప్రస్తుతానికి 100 కోట్ల వరకే ఉండడంతో ఆయన విజయ్ తో సినిమా చేసే అవకాశం అయితే కనిపించడం లేదు.
మరి ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డివంగ కాంబోలో మరొక సినిమా వస్తే చూడాలని చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక పాన్ ఇండియా సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమాలను చేస్తున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం మొదటి నుంచి కూడా తన కథను నమ్ముకునే ముందుకు సాగుతూ ఉంటాడు. ఆ కథ మాత్రమే సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే రీతిలో ఆ కథకు తగ్గట్టుగా మేకింగ్ ని అలవర్చుకుంటూ సినిమాను ముందుకు తీసుకెళ్తుంటాడు.
మరి ఏది ఏమైనా కూడా ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా మంచి కంటెంట్ తో వచ్చినప్పటికీ యూత్ ను ఎక్కువగా ఆకర్షిస్తూ భారీ విజయాలను సాధిస్తూ ఉండటం విశేషం… ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…