Sankranti : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనేది వాస్తవం… ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్ కి రప్పించిన హీరోగా వెంకటేష్ కి చాలా మంచి పేరైతే ఉంది. ఇక ఈ సంక్రాంతికి వెంకటేష్ హీరోగా వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా థియేటర్లోకి రానుంది. ఇక జనవరి 14వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందా లేదా అనే విషయాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా కొద్ది సంవత్సరాల పాటు తన సేవలను అందిస్తాడు. ఆ తర్వాత పోలీస్ జాబ్ నుంచి తప్పుకుంటాడు. ఇక ఐశ్వర్య రాజేష్ ను పెళ్లి చేసుకొని తన లైఫ్ లో సెటిల్ అయిపోతాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తన ఎక్స్ లవర్ అయిన మీనాక్షి చౌదరి కి ఒక కిడ్నాప్ కేసు ను చేదించమని ఒక ఆర్డర్ వస్తుంది. ఇక ఆ ఆపరేషన్ లో భాగంగా వెంకటేష్ ను కూడా అందులో భాగం చేసి మీనాక్షి ఆయన్ని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. దాంతో వీళ్లిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వెంకటేష్ భార్య అయిన ఐశ్వర్య రాజేష్ కూడా కూడా వాళ్లతో పాటు బయలుదేరుతుంది. మరి ఈ ఎంటైర్ సిచువేషన్ లో ఏం జరిగింది? మీనాక్షి చౌదరికి వెంకటేష్ కి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే మొదటినుంచి చివరి వరకు కామెడీ ఎంటర్టైనర్ గా ఉండే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ప్రతి సీన్ లో కూడా కామెడీ చేయిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు… అదే విధంగా ఎమోషన్ ని కూడా కొంతవరకు సరిగ్గా హాండిల్ చేస్తూ ముందుకు సాగిన అనిల్ రావిపూడి ఈ సినిమాను ప్రేక్షకులందరికి నచ్చే విధంగా తెరకెక్కించాడు.
ఇక ప్రతి క్యారెక్టర్ తో ఫన్ జనరేట్ చేస్తూనే ప్రేక్షకుల్లో సినిమా మీద ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడే విధంగా ప్రేక్షకులు ఆ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేసేలా ఆ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి సినిమాను తీసిన విధానం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇందులో చాలా బాగా నటించినట్టుగా తెలుస్తోంది. ఎవరీ క్రాఫ్ట్ లో వాళ్ళు ది బెస్ట్ అవుట్ పుట్ ని ఇచ్చారు… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలువబోతుంది…
ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటుంది. దాంతో ఒక్కసారిగా సినిమా మొత్తం టర్న్ అయిపోతుందనే చెప్పాలి… ఇక వెంకటేష్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా తెలుస్తోంది. అలాగే కథ కూడా సినిమాకి చాలా బాగా వర్క్ అవుట్ అయిందని కామెడీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది…