Game Changer : #RRR తర్వాత గ్లోబల్ వైడ్ గా సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిన రామ్ చరణ్, ఒక కథని నమ్మి తన మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని చేసాడు. గడిచిన పదేళ్లలో ఒక సినిమాపై ఇంతలా పనిగట్టుకొని టార్గెట్ చేసి నెగటివ్ చేయడం ఎప్పుడూ చూడలేదు. కేవలం పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులు తప్ప, మిగిలిన స్టార్ హీరోలు, ఒక పార్టీ కి చెందిన మీడియా సోషల్ మీడియా లో ఎదో జీతం తీసుకొని పని చేసిన ఉద్యోగులు లాగా ఈ సినిమా మీద నెగటివిటీ ని పెంచారు. అంతే కాదు, HD ప్రింట్ ని సోషల్ మీడియా లో విడుదల చేసి పైశాచిక ఆనందం పొందారు. ఇలాంటి విషం కక్కిన వారిపై నిర్మాత దిల్ రాజు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కాసేపటి క్రితమే ఆయన మీడియా కి విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
ఆ ప్రెస్ నోట్ లో ఏముందంటే ‘మూడేళ్లు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ ఈ సినిమా విడుదల రోజే ఒక 45 మందితో కూడిన ఒక ముఠా HD ప్రింట్ పైరసీ చేసి ఆన్లైన్ లో విడుదల చేసారు. సోషల్ మీడియా లో సినిమాలోని సన్నివేశాలను పోస్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. వాళ్ళందరూ చేసిన అత్యంత హేయమని పనిని ఆధారాలతో సహా పోలీసులకు అందిస్తున్నాము. ఊచలు లెక్కపెట్టడానికి సిద్ధం గా ఉండండి. సినిమా విడుదలకు వారం రోజుల ముందే మా మూవీ టీం కి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు వచ్చింది. అడిగినంత ఇవ్వకపోతే HD ప్రింట్ ని విడుదల చేస్తాము అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత విడుదల రోజు అన్నంత పనే చేసారు. విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన ట్విస్టులు సోషల్ మీడియా లో లీక్ చేసారు. కొంతమంది అయితే ప్రతీ సన్నివేశాన్ని విడుదలకు ముందు స్టోరీ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు’.
‘ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో ఉద్దేశపూర్వకంగా కొన్ని పేజీలు మా సినిమా మీద నెగటివ్ కామెంట్స్ చేసాయి. వారి మీద కూడా పోలీస్ కంప్లైంట్ చేసాము. ఈ నెగటివ్ క్యాంపైన్ వెనుక ఎవరు ఉన్నారు అనేది త్వరలోనే తెలియనుంది. ఎవ్వరినీ వదిలిపెట్టము’ అంటూ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మీడియా కి ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసారు. మరి చెప్పినట్టుగానే నిందితులపై చర్యలు తీసుకునేలా పోరాడుతారా లేదా అనేది చూడాలి. దీనిపై రామ్ చరణ్ అభిమానులు చాలా తీవ్రమైన ఆవేశంతో ఉన్నారు. బుక్ మై షో యాప్ లో కూడా వేల రూపాయిలు ఖర్చు చేసి ఈ సినిమాకి నెగటివ్ రేటింగ్స్ రప్పించేలా చేసారని తెలుస్తుంది.